
ఓం నమో వెంకటేశాయ’ లాంటి సినిమా తీయడంతో తన జన్మ ధన్యమైపోయిందంటున్నాడు కె.రాఘవేంద్రరావు. ఈ సినిమాకు వస్తున్న స్పందన చూసి ఆయన చాలా ఎగ్జైట్ అయిపోయారు. రెండు రోజులుగా ఎన్నెన్నో కాంప్లిమెంట్లు విన్నానని.. అందులో రెండు కాంప్లిమెంట్స్ ను మాత్రం మరిచిపోలేనని దర్వకేంద్రుడు అన్నాడు. ఆ రెండు కాంప్లిమెంట్స్ ఏవో రాఘవేంద్రరావు మాటల్లోనే తెలుసుకుందాం పదండి.
‘‘నేను ఏం ఆశించి ‘ఓం నమో వేంకటేశాయ’ సినిమా తీశానో.. ఈ రోజు అది నిజమైనందుకు సంతోషంగా ఉంది. జన్మ ధన్యమైంది అని మనం మామూలుగా అనేస్తుంటాం. కానీ ఇప్పుడు నిజంగా నేను ఆ భావనతోనే ఉన్నాను. సినిమా విడుదలైనప్పటి నుంచి ఎంతో మంది ఫోన్ చేసి అభినందిస్తున్నారు. అందులో రెండు ఫోన్ కాల్స్ మాత్రం మరచిపోలేను. ‘ఈ సినిమా చూసి మా జన్మ ధన్యమైంది. ఇంత అద్భుతమైన సినిమా తీసిన మీ కాళ్లకు నమస్కారం చేస్తున్నా’ అని ఒకరు చాలా ఉద్వేగంగా అన్నారు. ఇంకొకరు ఫోన్ చేసి ‘వెండితెరపై తిరుపతి పుణ్య క్షేత్రాన్ని ఆవిష్కరించిన మీకు జన్మంతా ఋణపడి ఉంటాం’ అన్నారు. ఈ జన్మకు నాకీ ప్రశంసలు చాలు.
మామూలుగా దేవుడిని చూస్తే విగ్రహం కనిపిస్తుంది. కానీ నాగార్జున కళ్లతో చూస్తే దేవుడు కనిపిస్తాడు అని ‘ఓం నమో వేంకటేశాయ’ ఆడియో వేడుకలో చెప్పాను. ఇప్పుడు సినిమా చూసిన వాళ్లకు అదే అనుభూతి కలుగుతోంది. చివర్లో దేవుడి విశ్వరూపం చూపించే సన్నివేశంలో అసలు నేను కట్ చెప్పలేకపోయాను. నాగార్జున అంతబాగా నటించాడు. ఈ సినిమాలో కళ్లతోనే నటించిన నాగార్జున నటన చూడడానికీ రెండు కళ్లూ చాలవు’’ అని రాఘవేంద్రరావు అన్నారు.
Recent Random Post: