రాణా హీరోనా, సైడ్‌ యాక్టరా?

‘బాహుబలి’ తర్వాత రాణాకి స్టార్‌డమ్‌ వస్తుందని సురేష్‌బాబు ఆశించారు. అందుకే రాజమౌళితో తనకున్న అనుబంధం కొద్దీ కొడుకు పేరు సిఫార్సు చేసి మరీ ‘బాహుబలి’లో అవకాశం ఇప్పించుకున్నారు. విలన్‌గా అయినా రాజమౌళి చిత్రంలో నటిస్తే రాణా పాపులర్‌ అయిపోతాడని, అభిమానుల్ని సంపాదించుకుంటాడని అనుకున్నారు. ‘బాహుబలి’లో భల్లాలదేవ పాత్ర రాణాకి నటుడిగా గుర్తింపునయితే తెచ్చిపెట్టింది కానీ రాణా కోరుకున్న స్టార్‌డమ్‌ అయితే ఇంకా రాలేదు.

బాహుబలి 2 వచ్చేలోగా రాణాకి ఎంత క్రౌడ్‌ పుల్లింగ్‌ కెపాసిటీ వుందనే దానిపై ఐడియాని ‘ఘాజీ ఎటాక్‌’ ఇవ్వనుంది. సబ్‌ మెరైన్‌ వార్‌ నేపథ్యంలో సాగే ఈ చిత్రం ప్రోమోస్‌ ఆకట్టుకుంటున్నాయి. కానీ ఇది బాక్సాఫీస్‌ వద్ద విన్నర్‌గా నిలుస్తుందా లేదా అనేది ఇప్పుడే చెప్పలేం. ఈ చిత్ర ఫలితాన్ని ఆధారంగా చేసుకుని రాణా హీరో అయినట్టా, లేక ఇంకా సైడ్‌ యాక్టర్‌గానే ప్రేక్షకులు చూస్తున్నారా అనేది తేలిపోతుంది.

బాహుబలి 2 వచ్చిన తర్వాత రాణా పరిస్థితి మారుతుందనేది సురేష్‌ కాంపౌండ్‌ నమ్మకం. కానీ అంతలోగా ఘాజీతోనే మార్గం సుగమం అయినట్టయితే బాహుబలి 2 రిలీజ్‌ వరకు రాణా వేచి చూడాల్సిన పని లేకుండా తన ప్రణాళికలు ముమ్మరం చేసుకోవచ్చు.


Recent Random Post: