చిన్నమ్మ దోషిగా తేల్చేసిన సుప్రీం

చిన్నమ్మ దోషి అని తేలిపోయింది. ఆ విషయాన్ని సుప్రీంకోర్టు మరోసారి నిర్ధారించింది. అక్రమాస్తుల కేసులో దివంగత జయలలితోపాటు మరోనలుగురు కూడా దోషులుగా తేలుస్తూ సుప్రీం తీర్పు ఇచ్చేసింది. ఇద్దరు సభ్యులున్నబెంచ్ లో మొదటగా తన తీర్పును వెల్లడించిన పినాక చంద్రఘోష్.. అక్రమాస్తుల కేసులో జయలలితతో సహా ఆరోపణలు ఎదుర్కొంటున్న శశికళ.. ఇళవరసు.. సుధాకరన్ లు దోషులుగా తేల్చారు.

వారిని నాలుగు వారాల్లో కోర్టులో లొంగిపోవాలని ఆదేశించారు. అవినీతి నిరోధక చట్టం 123బి.. 109 సెక్షన్ల కింద నమోదైన కేసుల్లో నిందితులుగా ఉన్న వారిని దోషులుగా తేలుస్తూ సుప్రీం తన నిర్ణయాన్ని వెల్లడించింది. ఇద్దరు సభ్యులున్న సుప్రీం బెంచ్ లో తొలుత పినాక చంద్రఘోష్.. తర్వాత రెండో న్యాయమూర్తి అమితావ్ కూడా జయలలితతోపాటు శశికళ మిగిలిన వారంతా దోషులుగా నిర్ధారించారు. వెంటనే వారిని పోలీసులకు లొంగిపోవాలంటూ ఆదేశాలు జారీ చేశారు.

సుప్రీం తాజా తీర్పుతో ప్రస్తుతం రిసార్ట్స్ లో ఉన్న శశికళ నేరుగా జైలుకు వెళ్లే అవకాశం ఉందన్న మాట వినిపిస్తోంది. సుప్రీం తీర్పుతో చిన్నమ్మ వర్గం షాక్ కు గురి కాగా.. పన్నీర్ సెల్వం గ్రూపు సంబరాల్లో మునిగిపోయింది. దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుతో శశికళ సీఎం కల ఎప్పటికీ కలగానే మిగిలిపోవటం ఖాయమని చెప్పక తప్పదు.


Recent Random Post: