బుల్లితెర ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్న ‘కార్తీకదీపం’ సీరియల్ 715 ఎపిసోడ్‌లను పూర్తి చేసుకుని.. 716 ఎపిసోడ్‌కి ఎంటర్ అయ్యింది. ఈ ఎపిసోడ్ హైలైట్స్ మీకోసం. తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న‘కార్తీకదీపం’ సీరియల్ నేటి (జనవరి 28) రాత్రి ఎపిసోడ్‌లో ఏం జరగనుందో ‘సమయం’లో మీకోసం ముందుగానే.
గత ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే…
హాస్పెటల్‌లో శ్రావ్య అరుస్తూ పెయిన్స్ పడుతూ ఉంటుంది. పక్కనే భాగ్యం ‘అయ్యో.. అమ్మో’ అంటూ అరుస్తూ ఉంటుంది. శ్రావ్యని చెక్ చేసిన డాక్టర్.. శ్రావ్యకి కడుపులో బిడ్డ అడ్డం తిరిగిందని కాస్త కష్టంగా ఉందని చెబుతుంది. వెంటనే.. భాగ్యాన్ని చూపిస్తూ.. ‘ముందు ఈవిడని బయటికి తీసుకుని వెళ్లండి..’ అని చెప్పడంతో.. పక్కనే ఉన్న కార్తీక్‌తో భాగ్యం ‘అదికాదు అల్లుడు గారూ మన శ్రావ్య’ అంటూ ఏదో చెప్పబోతుంది. ఇంతలో మురళీ కృష్ణ భాగ్యాన్ని బయటికి లాగి కాస్త దూరంగా ఉన్న చైర్‌లో భాగ్యాన్ని కూర్చోబెట్టి.. ‘ఇక్కడ నుంచి కదిలితే కాళ్లు విరగొడతా’ అని బెదిరిస్తాడు.
మౌనితకి కార్తీక్ ఫోన్..
రిజ్వానా డాక్టర్.. ‘మౌనిత రావాల్సిందే, పరిస్థితి సీరయస్‌గా ఉంది, కాల్ చేస్తే మీ పర్మీషన్, మీ వాళ్ల పర్మీషన్ కావాలంటోంది’ అని చెప్పడంతో.. కార్తీక్ మౌనితకి కాల్ చేస్తాడు. చక్కగా కారులో కూర్చుని.. ‘రాములో రాములో’ పాట పెట్టుకుని ఊగిపోతూ డాన్స్ చేస్తూ ఉంటుంది మౌనిత. కార్తీక్ ఫోన్ రావడంతో.. పాటలు ఆపేసి.. చాలా కూల్‌గా హలో అంటుంది. ‘నీకేమన్నా మెంటలా? శ్రావ్యకు నొప్పులు వస్తున్నాయంటే మా పర్మీషన్ కావాలన్నావట? త్వరగా బయలుదేరి రా’ అంటాడు కార్తీక్ కోపంగా..
యు డు వాట్ ఐ సే..
‘కానీ మీ వాళ్లు..’అంటూ సాగదీస్తుంది మౌనిత. ‘స్టుపిడ్.. మా వాళ్ల ముందే మాట్లాడుతున్నాను. యు డు వాట్ ఐ సే….’ అని ఫోన్ పెట్టేస్తాడు కార్తీక్. ‘థ్యాంక్యూ ప్రియమణి..’ అని మనసులో అనుకుంటూ.. ‘రిజ్వానా హాస్పెటల్ ముందే ఉన్నానని నీకేం తెలియదు పాపం? మనం వెయిట్ చెయ్యాలి.. కాసేపు’ అంటూ కారులో నే ఎంజాయ్ చేస్తుంది మౌనిత. మౌనిత వస్తుంది అనగానే కంగారుపడుతుంది దీప.
పిల్లల అనుమానం..
సౌర్య ఆలోచిస్తూ అటూ ఇటూ తిరుగుతుంది. ఇంతలో హిమా వచ్చి.. ‘సౌర్యా.. వంటలక్కని నేనేగా పరిచయం చేశాను? మరి వీళ్లందరికీ వంటలక్క ముందే తెలుసా?’ అంటుంది. సౌర్య కాస్త టెన్షన్‌గా చూస్తూ ఉంటుంది. ‘అసలు ఆ భాగ్యం అమ్మమ్మ మా డాడీని అల్లుడు గారు అందేంటీ?’ అంటుంది హిమ మళ్లీ తనే మాట్లాడుతూ.. ‘అవును నాదీ అదే డౌట్.. మా నా.. అదే మీ నాన్నని అల్లుడు గారు అందేంటీ?’ అంటుంది సౌర్య ఆలోచిస్తూ.. ఇద్దరూ అక్కడే కూర్చుని ఆలోచిస్తూ ఉంటారు.
మౌనిత ఎంట్రీ..
‘దేవుడా నా బిడ్డకి మగబిడ్డే పుట్టాలి.. ఆ ఆస్తి మొత్తానికి వారుసుడే కావాలి’ అని కోరుకుంటూ ఉంటుంది భాగ్యం బయట కూర్చీలో కూర్చుని. అప్పుడే మౌనిత ఎంట్రీ ఇస్తుంది. రావడమే భాగ్యాన్ని చూస్తూ.. ‘ఏమండీ భాగ్యం గారు.. మీరు నాలానే విసిరివేయబడ్డారా?’ అంటూ వెటకారం చేసి.. లోపలికి నడుస్తుంది. అప్పటికే మౌనితని చూసిన దీప, సౌందర్య, ఆదిత్య, ఆనందరావులు కటువుగా చూస్తుంటారు.
సౌందర్యకు చురకలు..
మౌనిత సైడ్‌గా దీపని చూసి.. లోపలికి నడుస్తుంది. ఇంతలో కార్తీక్.. ‘ఈ టైమ్ ఇలా చేస్తావేంటీ మౌనితా?’ అంటాడు. పక్కనే ఉన్న సౌందర్యని చూస్తూ.. ‘కావాలనే నన్ను పక్కన పెట్టి వేరే డాక్టర్‌ని మాట్లాడుకున్నారుగా ఇంత వరకూ’ అంటూ చురకలు వేసి.. లోపలికి నడుస్తుంది. లోపలికి వెళ్లేప్పుడు కూడా దీపని ఓ చూపు చూసి లోపలికి వెళ్తుంది.
శ్రావ్యకు పంచ్..
వెంటనే సౌందర్య దీప దగ్గరకు వెళ్తుంది. ‘అత్తయ్యా ఇదేమైనా చేస్తుందేమోనని భయంగా ఉంది అత్తయ్యా’ అంటుంది టెన్షన్‌గా.. ‘ఇదంతా దీని ప్లానే అని తెలియాలి.. అప్పుడు చెబుతాను దీని పని’ అంటుంది సౌందర్య కోపంగా. ఇంతలో లోపలికి వెళ్లిన మౌనితని చూసి శ్రావ్య షాక్ అవుతుంది. మౌనిత ఓ నవ్వు నవ్వి.. ‘భూమి గుండ్రంగానే ఉంటుంది కదా శ్రావ్యా’ అంటూ పంచ్ డైలాగ్స్ కొడుతూనే రిపోర్ట్ చెక్ చేస్తుంది.
నాది ఓ పాజిటివే..
‘రక్తం ఇంత తక్కువగా ఉంటే ఏం చేస్తున్నారు?’ అంటూ రిజ్వానాని మౌనిత తిట్టి.. ‘బయట ఎవరైనా ఓ పాజిటివ్ ఉంటే తీసుకుని రండీ’ అంటుంది. నర్స్ బయటకి వెళ్లి.. విషయం చెప్పడంతో.. ‘నాది ఓ పాజిటివే’ అంటూ దీప లోపలికి వెళ్తుంది. శ్రావ్యకు ధైర్యం చెప్పి.. దీప బ్లెడ్ ఇవ్వడానికి పడుకుంటుంది. శ్రావ్య నొప్పులు భరించలేక అల్లాడుతూ ఉంటుంది.
ప్రియమణి ఫోన్ కాల్..
ఇంతలో ప్రియమణి మౌనితకి కాల్ చేస్తుంది. ‘కాయా పండా అమ్మా’ అంటుంది. (బొప్పాయి పండు ఐడియా ఇచ్చింది ప్రియమణే). ‘అనుకున్నది అనుకున్నట్లుగానే చేస్తాను. సాయంత్రానికి మంచి డిన్నర్ చెయ్యి. పండుగ చేసుకుందాం’ అంటూ ఇన్‌జెక్షన్ సిద్ధం చేస్తుంది. శ్రావ్యతో.. ‘నీకు ఇప్పుడు మంచి ఇంజెక్షన్ ఇస్తాను.. నీకు బాధ మొత్తం పోతుంది’ అంటూ దీపని చూసి నవ్వుతుంది.
ఎందుకు ఇంత రచ్చ చేస్తుంది
దాంతో దీపకు గతంలో తను చేసిన ఇంజెక్షన్ గుర్తుకొచ్చి.. పరుగున వెళ్లి మౌనితని తోసేసి.. ‘అమ్మా శ్రావ్యా దాన్ని నమ్మకు.. ఇది కడుపులు పోగొడుతుంది’ అంటూ కంగారుపడుతుంది. దాంతో దీపని బయటికి తీసుకొచ్చేస్తారు రిజ్వానా. వెనుకే మౌనిత వస్తుంది. ‘అసలు ఎవరీమె..? ఎందుకు ఇంత రచ్చ చేస్తుంది’అంటుంది రిజ్వానా బయట ఉన్న కార్తీక్‌తో.. అంతా షాక్ అవుతారు.
ఇది కడుపు పోగొట్టడానికే వచ్చింది..
‘దాన్ని(మౌనితని) నమ్మొద్దు.. అది డెలివరీ చెయ్యడానికి రాలేదు. బిడ్డని చంపడానికే వచ్చింది’ అంటూ మౌనిత గురించి అందరి ముందూ చెబుతూనే ఉంటుంది దీప. కార్తీక్ కోపంతో చూస్తూ ఉంటాడు. స్టాపిట్ అని అరుస్తాడు. అయినా దీప ఆగదు. ‘ఇది కడుపు పోగొట్టడానికే వచ్చింది. దీన్ని బయటికి పంపించెయ్యండి. దాని చేతుల్లో పాయిజన్ ఇన్‌జక్షన్ ఉంది’ అంటూ ఏడుస్తూ చెబుతుంది. దాంతో కార్తీక్ తప్ప అందరూ నమ్ముతారు. ఆదిత్య అయితే ’ఏం చెబుతుందో విందాం అన్నయ్యా’ అంటూ కార్తీక్ అడ్డుకుంటాడు.
మౌనిత తెలివి..
దీప మాటలు నమ్మిన సౌందర్య.. కార్తీక్‌ని ‘రేయ్ ఆగరా..’ అంటూ మౌనిత దగ్గరకు వచ్చి.. ‘ఏం ఆ ఇన్‌జక్షన్? అసలు ఏం చేద్దామని వచ్చావ్?’ అంటుంది. వెంటనే మౌనిత.. ‘చూశావా కార్తీక్.. అందుకే నేను ఇక్కడికి రావాలంటే.. నీ పర్మీషన్.. నీ వాళ్ల పర్మీషన్ కావాలని చెప్పాను. నువ్వేమో యు డు వాట్ ఐ సే అంటూ ఇంగ్లీష్‌లో కోప్పడి నన్ను ఇక్కడికి రప్పించావ్.. మీరేమైనా నాకు దాయాదులవుతారా? మీ ఇంట్లో వారసుడు పుడితే చంపాడానికి?’ అంటుంది తెలివిగా.
కార్తీక్ ఆవేశం..
ఇంతలో రిజ్వానా.. మౌనిత చేతిలోని ఇన్‌జక్షన్ తీసుకుని.. ‘ఇది పాయిజన్ అని నీకు ఎవరు చెప్పారమ్మా? ఏం లాబ్‌లో అయినా చెక్ చెయ్యించండి. ఇది పాయిజన్ కాదు.. శ్రావ్యకు ఇది ఇవ్వడం చాలా అవసరం’ అంటూ అరుస్తుంది. అయినా దీప మనసులో భయం పోకపోవడంతో.. ‘కాదు డాక్టర్ బాబు’ అని ఏదో చెప్పబోతుంటే.. కార్తీక్ కోపంగా..
ఎవరి లిమిట్స్‌లో వాళ్లు..
‘నువ్వు.. మారవా?’ అంటూ దీపని తిట్టబోతాడు కార్తీక్. ఇంతలో సౌర్య, హిమలు అక్కడికి రావడం గమనించి.. ‘ఎవరి లిమిట్స్‌లో వాళ్లు ఉండటం మంచిది’ అంటూ అరుస్తాడు. ఆ మాటలకు సౌర్యకు కోపం వస్తుంది. ఇంతలో రిజ్వానా ‘అసలు ఎవరు ఈమె?’ అంటుంది. కాస్త దూరంగా కూర్చున్న భాగ్యం కూడా దీప మాటలు నమ్మి.. తన కూతురు శ్రావ్య గురించి కంగారు పడుతుంది.
దీపని పిచ్చిదాన్ని చెయ్యడానికే…
మౌనిత కావాలనే దీపని పిచ్చిదాన్ని చేసి.. దీపని మరింత దూరం చెయ్యడంతో పాటూ.. తనని తప్పుగా అర్థం చేసుకుంటున్నారనే ఉద్దేశం కార్తీక్‌కి కలిగేలా చెయ్యడానికే ఈ ప్లాన్ అంతా చేసింది. గతంలో శ్రావ్య కడుపు పోగొట్టడంతో పాటూ దీప ప్రెగ్నెన్సీ సమయంలో పాయిజన్ ఇన్‌జెక్షన్ ఇచ్చింది. సగం ఎక్కించే సరికి దుర్గ వచ్చి మౌనితని నోరు నొక్కి హాస్పెటల్ నుంచి తీసుకుని వెళ్లిపోతాడు. అంతా తలుచుకుని ఇప్పుడు కూడా మౌనిత.. శ్రావ్యని ఏదో చెయ్యడానికే వచ్చిందని భయపడుతోంది దీప. అయితే దీపని పిచ్చిదాన్ని చేసి తన అనుకున్నది చెయ్యాలని వచ్చింది మౌనిత.
కమింగ్ అప్‌లో..
దీప కంగారుని చూసి.. దీప తండ్రి మురళీ కృష్ణ.. ‘అమ్మా దీపా ఏంమైందమ్మా?’ అంటాడు. ఆ మాట విన్న హిమ.. మనసులో.. ‘దీపనా? వంటలక్క పేరు దీపనా?’ అంటూ ఆలోచినలో పడుతుంది. తన తల్లి పేరు కూడా దీప అని ముందే తెలిసి హిమకు.. తన తల్లిని తెలుసుకోవడానికి మరో క్లూ దొరికింది. మొత్తానికి కథ ఆసక్తిగా మారనుంది. మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం. కార్తీకదీపం కొనసాగుతోంది.
Recent Random Post: