కొరియోగ్రాఫర్ కమ్ హీరో కమ్ డైరెక్టర్ ప్రభుదేవా ఒక దశలో హీరోయిన్ నయనతారతో పీకల్లోతు ప్రేమలో మునిగిపోవడం, తన భార్య రమ్‌లతకు విడాకులు ఇచ్చి నయన్‌ను పెళ్లి చేసుకోవడానికి రెడీ అవడం.. కానీ ఇక పెళ్లే తరువాయి అనుకున్న దశలో ఇద్దరూ విడిపోవడం తెలిసిన సంగతే.
ఆ తర్వాత ప్రభుదేవా ఒంటరిగానే ఉండిపోగా.. నయన్ కొన్నేళ్ల విరామం తర్వాత దర్శకుడు విఘ్నేష్ శివన్ ప్రేమలో పడి అతడితో పెళ్లి దిశగా అడుగులేస్తోంది. ఐతే అప్పట్లో ప్రభుదేవాను తనకు కాకుండా చేసిందంటూ నయన్ మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది రమ్‌లత. అయితే నయన్ నుంచి విడిపోయినప్పటికీ.. ప్రభుదేవా తిరిగి తన భార్య దగ్గరికి వెళ్లలేదు. ఒంటరిగానే ఉండిపోయాడు. ఇప్పుడు నయన్‌తో అతడికి ఎలాంటి సంబంధం లేదు.
అయినప్పటికీ నయన్ మీద రమ్‌లత కోపం ఏమీ తగ్గిపోలేదు. ప్రభుదేవా నయన్‌ను పెళ్లి చేసుకోకున్నా సరే.. తనకు దూరమైపోవడంతో ఆమె ఇంకా రగిలిపోతూనే ఉంది. ఓ ఇంటర్వ్యూలో నయన్‌కు ఆమె శాపనార్థాలు పెడుతూ మాట్లాడింది.
తన భర్త 15 ఏళ్ల పాటు తనను, కుటుంబాన్ని ఎంతో ప్రేమగా చూసుకున్నాడని, అలాంటి వాడిని నయనతార వలలో వేసుకుందని.. తనకు కాకుండా చేసిందని రమ్‌లత ఆవేదన వ్యక్తం చేసింది. తన భర్తను నయనతార దొంగిలించిందని ఆమె ఆరోపించింది. ఇలా వేరొకరి భర్తల మీద కన్నేసే మహిళల్ని కఠినంగా శిక్షించాలని రమ్‌లత డిమాండ్ చేసింది.
తన భర్తను తనకు కాకుండా చేసిన నయనతార బాగుపడదని.. అంతకంతకూ అనుభవిస్తుందని ఆమె శాపనార్థాలు పెట్టింది. నయనతార తనకు ఎప్పుడు కనిపించినా ఆమె చెంప చెల్లుమనిపిస్తానని రమ్‌లత పేర్కొనడం గమనార.
Recent Random Post: