కమల్‌తో వ్యవహారంపై క్లారిటీ ఇచ్చింది

యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ సుదీర్ఘ కాలం పాటు నటి గౌతమితో సహజీవనం సాగించిన విషయం తెల్సిందే. ఆమెతో కొన్ని కారణాల వల్ల విడిపోయిన కమల్‌ ప్రస్తుతం హీరోయిన్‌ పూజా కుమార్‌ తో రిలేషన్‌ లో ఉన్నాడు అంటూ ప్రచారం జరుగుతోంది. ఆ విషయం గురించి గత కొన్ని రోజులుగా మీడియాలో వస్తున్న నేపథ్యంలో తాజాగా పూజా కుమార్‌ ఆ విషయంపై క్లారిటీ ఇచ్చేసింది.

ఇటీవల కమల్‌ పుట్టిన రోజు సందర్బంగా పూజా కుమార్‌ వేడుకలను నిర్వహించింది. ఆమె స్వయంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లుగా తమిళ మీడియాలో కథనాలు వస్తున్నాయి. గౌతమి నుండి దూరం అయిన కమల్‌ తాజాగా పూజా కుమార్‌ తో సన్నిహిత్యంగా ఉంటున్నట్లుగా వస్తున్న వార్తలకు అది మరింత బలం చేకూర్చినట్లయ్యింది. కాని కమల్‌ తో తన ప్రేమ వ్యవహారం పూర్తిగా అవాస్తవం అంటూ చెప్పుకొచ్చింది.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో పూజా కుమార్‌ మాట్లాడుతూ… గత అయిదు సంవత్సరాలుగా కమల్‌ సర్‌ తో నా జర్నీ కొనసాగుతుంది. ఆయనతో వర్క్‌ చేయడం చాలా గొప్ప విషయంగా చెప్పుకొచ్చింది. నేను ఈ సమయంలో కమల్‌ సర్‌ నుండి ఎన్నో విషయాలను నేర్చుకున్నాను. నేను ఆయన భార్య ప్లేస్‌ను భర్తీ చేస్తున్నట్లుగా వస్తున్న వార్తలు నిజం కాదని నేను ఆయనకు ఒక స్టూడెంట్‌ ను మాత్రమే అంది. ఆయన ఒక గొప్ప క్రియేటర్‌. ఆయన వద్ద ఉంటే ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు అంది.


Recent Random Post: