అంతా సినీ పక్కీలో కన్నడ హీరోయిన్ పెళ్లి జరిగిపోయింది. లాక్‌డౌన్ సమయంలో అత్యంత రహస్యంగా తన స్నేహితుడితో మూడు ముళ్లు వేయించుకుంది. బెంగళూరులోని శ్రీతిరుమలగిరి శ్రీలక్ష్మివెంకటేశ్వరస్వామి ఆలయంలో కన్నడ హీరోయిన్ మయూరి, తన స్నేహితుడితో కలిసి ఏడడుగులు నడిచారామె.
నక్షత్ర అనే టీవీ సీరియల్‌తో నటిగా అరంగేట్రం చేసిన మయూరి 2015లో కృష్ణ లీలా అనే చిత్రంతో సినీ పరిశ్రమలోకి ప్రవేశించారు. ఆ తర్వాత అనేక సినిమాల్లో ఆమె నటించారు. చూడ చక్కని రూపవతైన మయూరి కన్నడ చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు, స్థానాన్ని, అభిమానులను సొంతం చేసుకున్నారు.
తన స్నేహితుడైన అరుణ్‌ను అతికొద్ది మంది బంధువులు, మిత్రుల సమక్షంలో శుక్రవారం మయూరి వివాహమాడారు. కన్నడలో సెలబ్రిటీ అయిన మయూరి పెళ్లి విషయం ఏ మాత్రం బయటకు రాకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. తన పెళ్లి ఫొటోలను ఇన్‌స్టాలో షేర్ చేసేవరకు ఆమె పెళ్లి గురించి అభిమానులకు, సినిమావాళ్లకు తెలియదు.
‘అవును నేను, ఆరుణ్ ఈ రోజు ఉదయం వివాహం చేసుకున్నాం. పదేళ్ల స్నేహానికి ఈరోజు అర్థవంతమైన ముగింపు లభిం చింది. మా పెళ్లికి సంబంధించిన మరింత సమాచారం త్వరలో చెబుతాను’ అని ఇన్‌స్టాలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా మయూరి తన మెడలో అరుణ్ మూడు ముళ్లు వేస్తున్న వీడియోను షేర్ చేశారు. మూడు ముళ్ల అనంతరం మయూరి బుగ్గలు గిల్లుతూ ఉన్న ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇది ఇలా ఉండగా మూడో కంటికి తెలియకుండా , గుట్టుచప్పుడుకాకుండా తమ అభిమాన హీరోయిన్ పెళ్లి చేసుకోవడంపై అబిమానులు కాస్త గుర్రుగా ఉన్నారు. కానీ కొత్త జంటకు శుభాకాంక్షలు చెప్పి తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. కన్నడ ఆర్టిస్టులు కూడా మయూరి-అరుణ్‌లకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.
Recent Random Post: