జనాల దృష్టి మరల్చేందుకే ఈ కేసులంటున్న టిడిపి అధినేత

తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు అరెస్ట్‌ అయిన కొన్ని గంటల్లోనే జేసీ ప్రభాకర్‌ రెడ్డి ఆయన కుమారుడు అస్మిత్‌ రెడ్డిలు అరెస్ట్‌ అవ్వడంపై తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్‌ ప్రతికారంతో రగిలి పోతున్నాడు. తాను జైల్లో ఉన్న కారణంగా తెలుగు దేశం పార్టీ నాయకులను కూడా జైలుకు పంపిస్తున్నాడు. ఏడాది పాలనపై వ్యక్తం అవుతున్న విమర్శల నుండి దృష్టి మరల్చేందుకు ఈ కేసులు పెడుతున్నారంటూ బాబు ఆరోపించారు.

ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నందుకు కక్ష పూరితంగా వ్యవహరిస్తున్న జగన్‌ మోహన్‌ రెడ్డి అరెస్ట్‌లు చేయిస్తున్నాడు. అరెస్టులు చేయించినంత మాత్రాన భయపడేది లేదు. రెట్టించిన ఉత్సాహంతో ఖచ్చితంగా ప్రజా సమస్యలపై పోరాడతాం. తెలుగు దేశం పార్టీ నాయకులను ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా దెబ్బ తీసేందుకు జగన్‌ చేస్తున్న పనులను జనాలు చూస్తున్నారంటూ బాబు హెచ్చరించాడు. అరెస్ట్‌ అయిన నాయకులకు మద్దతుగా ఇంటి వద్దే ఉండి నాయకులు, కార్యకర్తలు తమ నిరసన తెలియజేయాలంటూ బాబు పిలుపునిచ్చారు.


Recent Random Post: