పవన్ కళ్యాణ్ తో క్రిష్ ఒక జానపద చిత్రాన్ని చేస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణ జానపదాల్లోని ఒక బందిపోటు జీవితం స్ఫూర్తిగా క్రిష్ ఈ సినిమా కథ రాసుకున్నాడు. పాత సినిమాలు బాగా ఇష్టపడే పవన్ కళ్యాణ్ క్రిష్ ఈ ఐడియా చెప్పిన వెంటనే ఓకే చేసాడు. తన సినిమాలకు బలమైన సౌండింగ్ ఉన్న టైటిల్స్ పెట్టే అలవాటున్న క్రిష్ దీనికోసం విరూపాక్ష అనేది వర్కింగ్ టైటిల్ గా పెట్టుకున్నాడు.
అయితే పవన్ మాత్రం టైటిల్ కూడా పాత జానపద సినిమాలను తలపించేదిగా ఉంటె బాగుంటుందని, ఎన్టీఆర్ నటించిన రెండు సినిమాల పేర్లు సూచించాడట.
బందిపోటు లేదా గజదొంగ టైటిల్ అయితే మాస్ అప్పీల్ తో పాటు కథకు, కాలమానానికి తగ్గట్టు ఉంటుందని పవన్ చెప్పడంతో ఈ టైటిల్స్ కూడా పరిశీలనలో ఉన్నాయట.
ఇక ఈ చిత్రం షూటింగ్ తక్కువ మంది సిబ్బందితో చేసేది కాదు కనుక ఈ ఏడాది చివరి వరకు మళ్ళీ మొదలు పెట్టకూడదని డిసైడ్ అయ్యారట. కరోనా కేసులు తగ్గుముఖం పట్టిన తర్వాత వకీల్ సాబ్ షూటింగ్ పూర్తి చేసి, పవన్ ఈ జానపద సినిమా సెట్స్ మీదకు వెళతాడు.
Recent Random Post: