బిగ్ బాస్ 4: నోయెల్ చీప్ ట్రిక్స్ బయట పెట్టిన వికీపీడియా.!

ఈ కోవిడ్ టైంలో ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని బుల్లితెర ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తున్న రియాలిటీ షో ‘బిగ్ బాస్ తెలుగు 4’. గత వారం కుమార్ సాయి ఎలిమినేటి అవ్వడంతో నేటి నుంచి 12 మంది కంటెస్టెంట్ లతో నేటి నుంచి షో సాగనుంది. ఇప్పుడు అసలు విషయంలోకి వస్తే.. బిగ్ బాస్ లో కంటెస్టెంట్స్ ని ప్రెస్కాహకులకి మరింత దగ్గర చేయడం కోసం అప్పుడప్పుడు వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్స్ గురించి లేదా వారి లైఫ్ లో జరిగిన బాధాకర సందర్భాలను షేర్ చేసుకొమనే టాక్స్ ఇస్తుంటాడు.

అలానే గత వారం బిగ్ బాస్ తమ ఫ్యామిలీ నుంచి కొన్ని మెమొరబుల్ ఫొటోస్ ని తెప్పించి వారికి ఇచ్చి, తమ ఎమోషన్ ని పంచుకోమన్నాడు. అందులో బిగ్ బాస్ హౌస్ లోకి మొదటి రోజు ఎంటర్ అయిన నోయెల్ వాళ్ళ నాన్న కూలి పని చేసేవాడని, తమని పెంచడంలో, తను సినీ ఫీల్డ్ లో సక్సెస్ అయ్యే వరకూ ఎంతో కష్టపడ్డాడని చెప్పుకొచ్చాడు. అది ఎమోషనల్ గా నోయెల్ కి బాగా వర్కౌట్ అయ్యింది కూడాను.. కానీ ఆ ఆనందం నాలుగు రోజులు కూడా లేకుండా పోయింది..

అసలు విషయంలోకి వెళితే.. నోయెల్ గురించి వికీపీడియాలో వాళ్ళ నాన్న ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసర్ అని ఉండడంతో చుసిన వారందరూ షాకి గురయ్యారు. అంతే కాకుండా షో ద్వారా కేవలం ప్రేక్షకుల నుంచి సింపతీ కోసం ఇలా చేశాడా అని అందరూ ట్రోల్స్ కూడా చేస్తున్నారు. ఈ ఒక్క ట్రోల్ తో నోయెల్ పై ఉన్న ఇంప్రెషన్ కాస్తా బాగా నెగటివ్ అయ్యింది. హౌస్ లోకి ఎంటర్ అయినా మొదటి వీక్స్ లో బాగా ఆడుతున్నాడు అనిపించుకున్న నోయెల్ ఈ మధ్య స్లో అయిపోయాడు. అంతే కాకుండా టాస్క్ లలో కూడా సరైన పెర్ఫార్మన్స్ ఇవ్వడం లేదు.

దీంతో తనకి ఓటింగ్ రేటు పడిపోతున్న టైంలో ఇలాంటి సంఘటన జరగడంతో మరింత డేంజర్ జోన్ లోకి నోయెల్ వెళ్లాడని పలువురు ట్రోల్ చేస్తున్నారు. మరి ఈ వీక్ అన్నా సూపర్బ్ పెర్ఫార్మన్స్ తో ఆ టాగ్ లైన్ తుడిపేసుకుంటాడేమో చూడాలి..


Recent Random Post: