సీఎం పళనిస్వామికి వైసీపీ ఎమ్మెల్యే రోజా పరామర్శ

వైసీపీ ఎమ్మెల్యే, ఎఐసిసి ఛైర్‌పర్సన్‌ ఆర్కే రోజా, తమిళనాడు సీఎం పళనిస్వామిని చెన్నైలో పరామర్శించారు. పళనిస్వామి తల్లి తవసాయమ్మ ఇటీవల అనారోగ్యంతో మరణించారు. ఈ నేపథ్యంలో సీఎం పళినిసామిని రోజాతోపాటు ఆమె భర్త ఆర్కే సెల్వమణి పరామర్శించి, సానుభూతి తెలిపారు. తవసాయమ్మ చిత్రపటం దగ్గర రోజా దంపతులు పుష్పాంజలి ఘటించారు.

కాగా, తమిళనాడు సీఎం పళనిసామిని పలువురు రాజకీయ ప్రముఖులు పరామర్శించారు. ఎండీఎంకే నేత వైగో, సీపీఐ నేత ముత్తరసన్‌, ఇటీవల బీజేపీలో చేరిన సినీ నటి ఖుష్బూ, డీఎంకే నేత సుదీప్‌, ప్రముఖ సినీ నిర్మాత ఆర్‌బి చౌదరి తదితరులు సీఎం పళనిస్వామిని పరామర్శించినవారిలో వున్నారు.

ఇదిలా వుంటే, తమిళనాడు సీఎం పళనిస్వామి హైద్రాబాద్‌ వరదల నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం తరఫున 10 కోట్ల విరాళాన్ని ప్రకటించిన సంగతి తెల్సిందే. విరాళం ప్రకటించిన పళనిస్వామికి, తమిళనాడు ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వం కృతజ్ఞతలు తెలిపింది. విరాళంతోపాటుగా, అవసరమైన సాయాన్ని అందిస్తామని తమిళనాడు ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వానికి తెలిపింది.


Recent Random Post: