జబర్దస్త్ ఫేమ్ అనసూయ ఇప్పుడు సినిమాల్లో కూడా రాణిస్తోంది. కథకు ప్రాధాన్యం ఉన్న సినిమాలను ఎంచుకుంటూ తన ప్రయాణాన్ని ముందుకు తీసుకెళుతోంది. యాంకర్ గా గ్లామర్ గా కనిపించే అనసూయ సినిమాల్లో మాత్రం విభిన్నమైన కథలను ఎంచుకుంటూ అందరినీ ఇంప్రెస్ చేస్తోంది.
మాస్ మహారాజా రవితేజ హీరోగా రూపొందుతోన్న ఖిలాడీ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తోంది అనసూయ. అలాగే థాంక్యూ బ్రదర్ అనే సినిమాలో గర్భవతిగా కనిపించనుంది. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఇటీవలే విడుదలైన సంగతి తెల్సిందే.
ఇక అనసూయ గర్భవతిగా కనిపించనున్న నేపథ్యంలో తనకు మళ్ళీ తల్లి కావాలని ఉందని, తన మనసులో మాటను బయటపెట్టింది అనసూయ. ఇప్పటికే ఈ 36 ఏళ్ల గ్లామరస్ యాంకర్ కు ఇద్దరు పిల్లలు. ఇద్దరూ అబ్బాయిలే. అయితే మరోసారి అమ్మతనాన్ని, మాతృత్వపు మధురిమను ఆస్వాదించాలని ఉందని చెబుతోంది. మరి ఆమె భర్త మనసులో ఏముందో మాత్రం రివీల్ చేయలేదు.
మరి చూడాలి అనసూయ తన మనసులోని కోరికను తీర్చుకుంటుందో లేదో.
Recent Random Post: