అనసూయ రెండోసారైనా పవన్ కు ఎస్ చెబుతుందా?

ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న ఫీమేల్ యాంకర్లలో అనసూయ స్థానం ప్రత్యేకమైంది. ఇద్దరు పిల్లలకు తల్లైనా కూడా అనసూయ తన గ్లామర్ తో యువతకు గాలం వేస్తూ టాప్ స్థాయిలో దూసుకుపోతోంది. అటు బుల్లితెరతో పాటు సిల్వర్ స్క్రీన్ పై కూడా అనసూయ దుమ్ము రేపుతోంది. అయితే సినిమాల వరకూ ఆమె చాలా సెలెక్టెడ్ గా సినిమాలను ఎంచుకుంటోంది.

రవితేజ నటిస్తోన్న ఖిలాడీలో అనసూయ కీలక పాత్ర పోషిస్తోంది. అలాగే కృష్ణవంశీ సినిమా రంగమార్తాండలో కూడా ఆమె కనిపించనుంది. ఇక తమిళంలోకి కూడా అనసూయ ఎంట్రీ ఇస్తోంది. తాజా సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ సినిమాలో నటించే ఆఫర్ అనసూయకు వచ్చింది.

నిజానికి అత్తారింటికి దారేది సినిమాలోనే అనసూయ నటించాల్సి ఉంది. కానీ వ్యక్తిగత కారణాల వల్ల కుదర్లేదు. ఇప్పుడు క్రిష్ దర్సకత్వంలో పవన్ నటించే సినిమాలో అనసూయను ఒక చిన్న పాత్ర, స్పెషల్ సాంగ్ కోసం అడుగుతున్నారు. ఆమె కూడా ఎస్ చెప్పినట్లు సమాచారం.


Recent Random Post: