
ఒక మనసుతో హీరోయిన్గా పరిచయమైన నాగబాబు తనయ నిహారికకి ఆ చిత్రంతో చేదు అనుభవం మిగిలింది. ఆ సినిమా ఫ్లాప్ అవడమే కాకుండా, వేరే అవకాశాలు కూడా ఏమీ రాలేదు. దాంతో తన నట తృష్ణ తీర్చుకోవడానికి వెబ్ సిరీస్లు వరసపెట్టి చేస్తోన్న నిహారిక ఫైనల్గా రెండవ చిత్రాన్ని తమిళంలో చేయబోతోంది.
విజయ్ సేతుపతి సినిమాలో హీరోయిన్గా ఎంపికైన నిహారిక ఈ ఛాన్స్ వచ్చినందుకు హ్యాపీగా వుంది. అయితే నిహారిక విషయంలోను ఏ భాష హీరోయిన్లు అక్కడి పరిశ్రమకి పనికి రారని తేలిపోయింది. పక్క రాష్ట్రాల హీరోయిన్లని ఎంకరేజ్ చేసే తెలుగు చిత్ర పరిశ్రమ తెలుగు హీరోయిన్లని అంతగా ఆదరించడం లేదు. గత ఇరవయ్యేళ్లలో పరిచయమైన తెలుగు హీరోయిన్లలో చాలా మంది ఇక్కడ అవకాశాలు లేక పక్క రాష్ట్రానికి వెళ్లిపోయారు.
అంజలిలాంటి వాళ్లు తమిళ చిత్ర సీమలో బిజీ అయ్యాకే మళ్లీ ఇక్కడికి వచ్చారు. చిరంజీవి అండ వున్నప్పటికీ నిహారిక కూడా అదే విధంగా పక్క రాష్ట్రానికి వలస వెళ్లక తప్పడం లేదు. మరి తమిళ చిత్ర రంగంలో సక్సెస్ అయిన తర్వాత నిహారికని మన వాళ్లు గుర్తిస్తారో లేక అప్పటికీ పట్టించుకోరో ఆమె ఒక నాలుగైదు తమిళ చిత్రాలు చేస్తే కానీ తెలీదు.
Recent Random Post: