ఏపీ ప్రభుత్వం తెలుగు దేశం పార్టీ నాయకులపై పెడుతున్న అక్రమ కేసులను జనాలు చూస్తున్నారని ప్రతి ఒక్కదానికి కూడా మూల్యం చెల్లించాల్సి ఉంటుంది అంటూ ఆ పార్టీ నాయకులు హెచ్చరిస్తున్నారు. ఇదే సమయంలో తెలుగు దేశం పార్టీ నాయకుడు ఎమ్మెల్సీ నారా లోకేష్ తీవ్రంగా స్పందించాడు. చంద్రబాబు నాయుడుపై కేసు నమోదు చేసేందుకు ప్రయత్నిస్తున్న సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మరియు వైకాపా నాయకులకు తీవ్ర హెచ్చరికలను నారా లోకేష్ చేయడం జరిగింది.
అసైన్డ్ భూముల వ్యవహారంలో చంద్రబాబు నాయుడుకు సీఐడీ నోటీసులు ఇవ్వడంపై నారా లోకేష్ స్పందిస్తూ.. తాను పట్టిన కాలుకు మూడే కాళ్లు అని నమ్మించేందుకు జగన్ రెడ్డి చేస్తున్న ప్రయత్నాలు చూస్తుంటే నవ్వు వస్తుంది. అమరావతిలో ఇన్ సైడ్ ట్రేడింగ్ జరిగినట్లుగా వారు పదే పదే వాదిస్తున్నా కోర్టు దాన్ని కొట్టి వేస్తూ వచ్చింది. ఇప్పుడు చివరకు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును చంద్రబాబు నాయుడుపై వేసేందుకు ప్రయత్నిస్తున్నారు. సిల్లీ కేసులు పెట్టి చంద్రబాబు నాయుడు గడ్డం మీద ఉన్న ఒక్క వెంట్రుక కూడా పీకలేరు అంటూ చాలా సీరియస్ గా లోకేష్ అన్నాడు.
తాను పట్టిన కుందేలుకి మూడే కాళ్ళు అని నమ్మించడానికి @ysjagan పడుతున్న తిప్పలు చూస్తుంటే నవ్వొస్తుంది.అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ అనే అంశమే లేదంటూ కోర్టు అనేక సార్లు చీవాట్లు పెట్టినా పాత పాటే ఎన్నాళ్లు?(1/2) pic.twitter.com/T8dLW4LBim
— Lokesh Nara (@naralokesh) March 16, 2021