ఆ గొడవల్లోంచి తప్పుకున్న అల్లు అర్జున్‌

తెలుగు రాష్ట్రాలతో పాటు కర్నాటక, కేరళలో కూడా మంచి ఫాలోయింగ్‌ వున్న అల్లు అర్జున్‌ తమిళనాట కూడా పాగా వేద్దామని ప్లాన్‌ వేసుకున్నాడు. తెలుగు చిత్రాలని అనువదించి అక్కడికి వెళ్లడం కంటే స్ట్రెయిట్‌ తమిళ చిత్రం చేయాలనేది అతని ఐడియా. తమిళ స్టార్‌ దర్శకుడు లింగుస్వామితో మాట్లాడుకుని అంతా సెట్‌ చేసుకున్నాడు కూడా. ఈ చిత్రాన్ని నిర్మించడానికి కె.ఈ. జ్ఞానవేల్‌రాజా ముందుకొచ్చాడు. ఈ చిత్రం అనౌన్స్‌మెంట్‌ కూడా చెన్నయ్‌లో ఆడంబరంగా జరిగింది. అయితే ప్రస్తుతానికి అల్లు అర్జున్‌ ఈ చిత్రాన్ని హోల్డ్‌లో పెట్టాడని సమాచారం. లింగుస్వామి గత చిత్ర పరాజయం వల్ల ఆ సినిమా బయ్యర్లు అతని తదుపరి చిత్రం రైట్స్‌ కోసం పట్టుబడుతున్నారట. అలాగే జ్ఞానవేల్‌రాజాకి కూడా గత సినిమాల కారణంగా ఏవో సమస్యలు వున్నాయట.

ఇప్పుడీ చిత్రంపై వాటి భారం పడే అవకాశం వుండడంతో దీనిని ముందుకు తీసుకెళ్లడానికి ఆయన తటపటాయిస్తున్నాడట. దీంతో ఈ వ్యవహారం ఏదో తేల్చుకుని, మిగిలిన లావాదేవీలతో సంబంధం లేకుండా ఈ ప్రాజెక్ట్‌ని పట్టాలెక్కిస్తే చేస్తానని, అంతవరకు వేరే సినిమా చేసుకుంటానని చెప్పాడట. దీంతో ఇప్పుడీ సినిమాని ఒక దారిన పెట్టే బాధ్యత సదరు నిర్మాత, దర్శకులపైనే వుంది. ‘దువ్వాడ జగన్నాథమ్‌’ షూటింగ్‌ పూర్తయిన వెంటనే ఏప్రిల్‌లో వక్కంతం వంశీ చిత్రాన్ని అల్లు అర్జున్‌ స్టార్ట్‌ చేస్తాడు. అది పూర్తయ్యే టైమ్‌కి వీళ్ల గొడవలు సెటిల్‌ అయితే ఓకే. లేదంటే ఈ ప్రాజెక్ట్‌ అటకెక్కినట్టే.


Recent Random Post: