
తమిళ చిత్ర రంగంలో హీరోగా నిలదొక్కుకుని ఇప్పుడు తెలుగు మార్కెట్‌లో కూడా ప్రవేశించిన విజయ్ ఆంటోని ముందుగా సంగీత దర్శకుడిగా సినీ రంగంలోకి అడుగు పెట్టాడు. మహాత్మ చిత్రానికి మ్యూజిక్ చేసింది అతనే. అయితే అనుకోకుండా హీరో అయిన విజయ్ ఆంటోని అప్పట్నుంచి విభిన్నమైన కథలు ఎంచుకుంటూ తనకంటూ ఒక ఐడెంటిటీ సాధించాడు. బిచ్చగాడు సక్సెస్‌తో టాలీవుడ్ ట్రేడ్‌లోను హాట్‌గా మారాడు. అయితే నటుడిగా తనకి చాలా లిమిటేషన్స్ వున్నాయని విజయ్ ఆంటోని ఒప్పుకుంటాడు.
తాను గొప్ప నటుడ్ని కాదని, అందుకే ఆ మైనస్‌లు కవర్ చేసుకోవడానికి మంచి కథలు ఎంచుకుంటానని, మంచి కథ వున్న సినిమా చేస్తే నటుడిలో వున్న లోపాలు కూడా కొట్టుకుపోతాయని, అందుకే ఎన్ని ఆఫర్లు వచ్చినప్పటికీ ఒక సినిమా తర్వాత ఒక సినిమా అంటూ నెమ్మదిగా వెళుతున్నానని చెప్పాడు. అయితే సాంకేతిక నిపుణుడిగా కంటే నటుడిగానే ఎంజాయ్ చేస్తున్నానని, పేరు, ఆదాయంతో పాటు నటుడి జాబ్‌పై ఎలాంటి ఒత్తిడి కూడా వుండదని, తెగ సంపాదించేద్దామనే ఆశలు లేవు కానీ ఇప్పుడున్నది కంటిన్యూ చేస్తూ విజయాలు అందుకోగలిగితే అదే చాలని అంటున్నాడు. విజయ్ నటించిన యమన్ ఈ శుక్రవారం రిలీజ్ అవుతోంది. ఈ పొలిటికల్ థ్రిల్లర్ అన్ని రాష్ట్రాల రాజకీయాలని ప్రతిబింబిస్తుందని, అంచేత నేటివిటీ సమస్యలుండవని విజయ్ ఆంటోని నమ్మకంగా వున్నాడ
Recent Random Post: