రూపాయి ఇవ్వను… వాళ్ల చావు వాళ్లే ఛస్తారు!

నష్టాలొచ్చిన సినిమాలకి నష్ట పరిహారం కోసం బయ్యర్లు నిర్మాతలని సంప్రదించడం ఒక్క తెలుగు, తమిళ చిత్ర రంగాల్లోనే కాకుండా అంతటా వుందని ‘కాబిల్‌’తో రుజువైంది. ఈ చిత్రాన్ని భారీ రేట్లకి విక్రయించిన నిర్మాత రాకేష్‌ రోషన్‌ అన్ని హక్కులు కలిపి ఎనభై కోట్ల లాభాలు వెనకేసుకున్నాడట. అయితే ఈ చిత్రాన్ని ఇండియాలో పంపిణీ చేసిన పలువురు బయ్యర్లు బాగా నష్టపోయారట. వారు రాకేష్‌ని సంప్రదించి తమ గోడు వినిపించారని, పదిహేను కోట్ల నష్ట పరిహారం ఇవ్వమని అడిగారని, దానికి రాకేష్‌ సానుకూలంగా స్పందించాడని వార్తలొచ్చాయి. అయితే రాకేష్‌ రోషన్‌ మాత్రం రూపాయి ఎవరికీ వెనక్కి ఇచ్చేది లేదని అంటున్నాడు.

అసలు తనని ఎవరూ సంప్రదించలేదని, కాబిల్‌ విజయాన్ని ఓర్వలేక కొందరు ఈ దుష్ప్రచారం చేస్తున్నారని, ఈ సినిమా సూపర్‌హిట్‌ అయి అందరూ హ్యాపీగా వున్నారని ఆయన మరోసారి గట్టిగా చెప్పాడు. అయితే ఈ చిత్రం బాక్సాఫీస్‌ పర్‌ఫార్మెన్స్‌ అంతంత మాత్రమేనని, ఎనభై అయిదు కోట్లకి కొంటే కనీసం యాభై కోట్లు కూడా తిరిగి రాలేదని ట్రేడ్‌ లెక్కలు చెబుతున్నాయి. తన సినిమా వసూళ్లని ఎక్కువ చేసి చెప్పుకునే అలవాటున్న రాకేష్‌ రోషన్‌ ఇప్పటికీ అదే ఫేక్‌ లెక్కలు చెబుతూ సినిమా హిట్టని చెప్పడం హాస్యాస్పదం. రోషనల దగ్గరకి పోయిన రూపాయి తిరిగి రాలదని ఈ ఉదంతం ఇంకోసారి రుజువు చేసింది.


Recent Random Post: