
దువ్వాడ జగన్నాథమ్’ ఫస్ట్ లుక్ రిలీజ్ అయిన దగ్గర్నుంచి ఈ ఫస్ట్ లుక్‌కి ఇంత క్రేజ్ వచ్చింది, ఫాన్స్ దీనిని సెలబ్రేట్ చేసుకుంటున్నారంటూ చాలా హడావిడి స్టార్ట్ అయింది. పోనీ అదేమైనా బన్నీ స్టయిలిష్‌గా కనిపించే పిక్ కానీ, యాక్షన్ స్టిల్ కానీ అయితే దానిని చూసి ఫాన్స్ వెర్రెత్తిపోతున్నారని చెప్పుకున్నా బాగుండేది.
బ్రాహ్మడి వేషంలో స్కూటర్ నిండా కాయగూరలు మోసుకుని వస్తోన్న అల్లు అర్జున్ స్టిల్ చూసి ఫాన్స్ ఫిదా అయిపోయి దానిని తమ బైక్‌లపై, షర్టులపై ముద్రించుకుంటున్నారని, తెలుగు రాష్ట్రాలతో పాటు కేరళ, కర్నాటకలో కూడా ఈ ఫస్ట్ లుక్ రిలీజ్‌ని సెలబ్రేట్ చేసుకున్నారని హడావిడి ఓ రేంజ్లో జరిగింది. ఇలాంటి విపరీతాలు తమిళ వాళ్లు చేస్తుంటారు కానీ మన అభిమానులకి ఇంత పిచ్చితనం లేదు.
ఇదంతా కేవలం స్టేజ్డ్ వ్యవహారంలా, అల్లు అర్జున్ క్రేజ్‌ని హైలైట్ చేయడానికి ఎక్స్ట్రా ఎఫర్ట్లా కనిపించింది. సోషల్ మీడియా లైకుల దగ్గర్నుంచి, రుద్రమదేవి చిత్రానికి ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్‌ని నిలబెట్టడానికి చేసిన ఓటింగ్ స్కామ్ వరకు ఎన్నో చూసిన వాళ్లు ఇదంతా ప్రీ ప్లాన్డ్ అని తీసి పారేస్తున్నారు. ఈ క్రమంలో అల్లు వర్గం అభిమానులు, పవన్‌కళ్యాణ్ అభిమానుల మధ్య ట్వీట్ల యుద్ధం కూడా జరిగింది.
అల్లు అర్జున్ స్టార్డమ్ నానాటికీ పెరుగుతోందనే దాంట్లో సందేహాలు లేవు. అతని సినిమాల విజయాలే దీనిని రుజువు చేస్తున్నాయి. అయితే పవన్, మహేష్, ఎన్టీఆర్ ఎవరికీ లేనంత క్రేజ్ అతనికే వుందన్నట్టు ప్రొజెక్ట్ చేసుకోవడం మాత్రం ఒకింత ఎక్స్ట్రా అని న్యూట్రల్స్ ఇలాంటివి ఆపేస్తే బెటర్ అంటూ సలహాలిస్తున్నారు.
Recent Random Post: