
షూటింగ్ మొదలు పెడితే అదే పనిగా చేస్తుంటాడు కానీ ఒకసారి గ్యాప్ వస్తే మళ్లీ సెట్స్ మీదకి వెళ్లడానికి చాలా బద్ధకిస్తుంటాడనే పేరుంది. నెలల తరబడి ఖాళీగా కూర్చోవడం వల్లే ‘గోవిందుడు అందరివాడేలే’, ‘బ్రూస్లీ’ చిత్రాలని కంగారుగా చుట్టేయాల్సి వచ్చిందని, ధృవ చిత్రాన్ని అన్ సీజన్లో రిలీజ్ చేసుకునే పరిస్థితి తలెత్తిందనే విమర్శలున్నాయి.
ఆ పాఠాలతో అయినా ఈసారి త్వరగా సినిమా పట్టాలెక్కిస్తాడనుకుంటే, సుకుమార్ చిత్రానికి అన్నీ ఓకే అయినప్పటికీ ఇంకా షూటింగ్ అయితే మొదలు పెట్టలేదు. ఫిబ్రవరి స్టార్టింగ్లోనే మొదలవుతుందని అనుకున్న చిత్రం మార్చి వచ్చేస్తున్నా స్టార్ట్ అవలేదు. సుకుమార్ సహజంగా ఎక్కువ టైమ్ తీసుకునే దర్శకుల లిస్టులోకి వెళతాడు. దసరాకి రిలీజ్ చేద్దామనేది ప్లాన్ అయినప్పుడు అతనికి వీలయినంత ఎక్కువ సమయం ఇవ్వడానికి ప్రయత్నించాలి. అంతే తప్ప ఇలా ఖాళీగా రోజులు గడుపుతూ కూర్చుంటే చివర్లో డెడ్లైన్ మీట్ అవడానికి ఇబ్బందులు పడాలి. అది సినిమా క్వాలిటీ మీద ఎఫెక్ట్ చూపించవచ్చు లేదా టైమింగ్ కుదరక అచ్చంగా సినిమా ఫలితాన్నే దెబ్బతీయవచ్చు.
ఒకానొక టైమ్లో ఏడాదికి రెండు సినిమాలు చేస్తానంటూ అభిమానులకి మాట ఇచ్చిన చరణ్ ఇప్పుడది పూర్తిగా మర్చిపోయినట్టున్నాడు. ఏడాదికి ఒకటే సినిమా చేయాలని ఫిక్స్ అయి దానికి కూడా అయిదారు నెలలు మాత్రమే కేటాయిస్తున్నాడు. చిరంజీవి తనయుడి నుంచి అభిమానులు కోరుకునేది ఇదయితే ఖచ్చితంగా కాదు.
Recent Random Post: