ఆంధ్ర సీఎం అవుతున్న తమిళ హీరో..?

టైటిల్ చూసి కొద్దిగా కన్ ఫ్యూజ్ అయ్యుండొచ్చు.. తప్పులేదు ఆంధ్రా సీఎం వైఎస్ జగన్ ఉండగా మరో సీఎం ఏంటి అని డౌట్ రావడం కామనే సీఎం వైఎస్ జగనే కానీ ఆయన కాపీ పేస్ట్ చేసేందుకు తమిళ హీరో రెడీ అవుతున్నాడు.

అసలు విషయం ఏంటి అంటే వైఎస్సార్ జీవిత కథతో వచ్చిన యాత్ర సినిమాకు కొనసాగింపుగా యాత్ర 2 సినిమా ఎనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. మహి వి రాఘవ ఈ సినిమా తీయాలని కొన్నాళ్లుగా ప్రయత్నిస్తున్నా ఎందుకో ముందుకు కదల్లేదు. ఫైనల్ గా ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ సెట్స్ మీదకు వెళ్లబోతుందని తెలుస్తుంది.

యాత్ర సినిమాలో వైఎస్ఆర్ పాత్రలో మమ్ముట్టి నటించి మెప్పించారు. వైఎస్ఆర్ స్టైల్ ని డిటో దించి మమ్ముట్టి ప్రేక్షకులను ఇంప్రెస్ చేశారు. ఇక యాత్ర 2 కథ వైఎస్ జగన్ గురించి ఉండబోతుందని చెప్పుకుంటున్నారు.

యాత్ర 2 సినిమాలో వైఎస్ జగన్ పాత్రలో తమిళ హీరో జీవా నటిస్తారని తెలుస్తుంది. అంతకుముందు ఈ పాత్ర కోసం స్టార్ హీరో సూర్యని అడిగారని వార్తలు వచ్చాయి. కానీ వెండితెర మీద వైఎస్ జగన్ గా కోలీవుడ్ హీరో జీవా కనిపించనున్నారట.

వైఎస్ జగన్ సీఎం అయిన దగ్గర నుంచి కథ మొదలవుతుందని ఇదివరకే డైరెక్టర్ మహి వి రాఘవ చెప్పారు. యాత్ర తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న మహి వి రాఘవ సిద్ధ లోకం ఎలా ఉంది నాయనా అనే సినిమా చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. మరి ఆ సినిమా ఏమైందో ఏమో కానీ యాత్ర 2 సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్నట్టు టాక్.

మొదట ప్రొడ్యూసర్ గా ఎంట్రీ ఇచ్చి రెండు సినిమాలు నిర్మించిన మహి వి రాఘవ పాఠశాల ఆనందో బ్రహ్మ సినిమాలతో ప్రతిభ చాటాడు. 2019లో వచ్చిన యాత్ర సినిమాతో ప్రేక్షకులను మెప్పించాడు. మళ్లీ నాలుగేళ్ల తర్వాత యాత్ర 2 ని సెట్స్ మీదకు తీసుకెళ్తున్నాడు. యాత్ర 2లో జీవా నటిస్తున్న వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో మరికొద్ది రోజుల్లో తెలుస్తుంది.


Recent Random Post: