పశ్చాత్తాపం బాధ లేదు.. అవి చేసి ఉండకూడదు

అక్కినేని ఫ్యాన్స్ కు బ్యాక్ టు బ్యాక్ షాక్ లు తగులుతున్నాయి. ఈ సమయంలో నాగ చైతన్య తన కస్టడీ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. గత చిత్రం థాంక్యూ సినిమా నిరాశ పర్చిన నేపథ్యంలో ఈ సినిమా పై చాలా నమ్మకంతో చైతూ ఉన్నట్లుగా తెలుస్తోంది. అంతే కాకుండా ఈ సినిమా తో తమిళనాట కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.

వెంకట్ ప్రభు దర్శకత్వంలో రూపొందిన కస్టడీ సినిమాను తెలుగు లో భారీ ఎత్తున విడుదల చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్ లో భాగంగా ఒక మీడియా సంస్థకు నాగ చైతన్య ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ ఇంటర్వ్యూలో భాగంగా పలు ఆసక్తికర విషయాలను వెళ్లడించాడు. ఆ సమయంలోనే పశ్చాత్తాపం మరియు బాధల గురించి వ్యాఖ్యలు చేశాడు.

ఇంటర్వ్యూలో యాంకర్ మీ జీవితంలో బాధ పడ్డ సందర్భాలు.. పశ్చాత్తాపం పడ్డ సందర్భాలు ఏమైనా ఉన్నాయా అంటూ ప్రశ్నించాడు. ఆ సమయంలో నాగ చైతన్య నుండి సింపుల్ సమాధానం వచ్చింది. తన జీవితంలో ఏ పని చేసి కూడా పశ్చాత్తాపం పడలేదు. ఏం చేసినా కూడా అనుభవమే.. కనుక ప్రతి విషయం నుండి కూడా కొత్తది నేర్చుకున్నాను అన్నట్లుగా చెప్పుకొచ్చాడు.

తన జీవితంలో పశ్చాత్తాపం మరియు బాధ అయితే లేదు కానీ కెరీర్ లో రెండు మూడు సినిమాలు ఎందుకు చేశాను అనే బాధ ఉంటుందని చెప్పుకొచ్చాడు. ఆ సినిమాలు చేయకుండా ఉంటే బాగుండేది అనే వ్యాఖ్యలు చేశాడు. ఆ సినిమా లు ఏంటీ అనే విషయం లో చైతూ క్లారిటీ ఇవ్వలేదు.

నాగ చైతన్య కస్టడీ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల జోరు పెంచబోతున్నారు. కస్టడీ సినిమా మే 12వ తారీకు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. వచ్చే వారంలో భారీ ఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించబోతున్నారు. అందుకోసం ఏర్పాట్లు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా తమిళనాట కూడా ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.


Recent Random Post: