
ఆలస్యంగా ప్రకటించిన నంది అవార్డులు ఎప్పటిలానే ఆశ్చర్యానికి గురి చేసాయి. చాలా వరకు ముఖ్య అవార్డులు జ్యూరీ పారదర్శకతపై ప్రశ్నార్ధకాన్ని వేలాడదీసాయి. ముఖ్యంగా 2013కి ఉత్తమ నటుడిగా ప్రభాస్‌ని ఎంపిక చేయడం డిస్కషన్ పాయింట్ అయింది. 2013కి గాను ప్రభాస్, మహేష్ (సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు), పవన్‌కళ్యాణ్ (అత్తారింటికి దారేది) ఫ్రంట్ రన్నర్స్ అని వార్తలొస్తూనే వున్నాయి.
అయితే ప్రభాస్ తరఫున లాబీయింగ్ గట్టిగా జరిగిందని గుసగుసలు వినిపించాయి. బాహుబలి 2 రిలీజ్‌కి ముందు ఇది కూడా ఒక విధంగా పబ్లిసిటీకి పనికి వస్తుందని ‘బాహుబలి’ బృందం కూడా తలా ఒక మాట వేసారట. ఎలాగో అమరావతి కోసం రాజమౌళి సాయం కోరిన చంద్రబాబుకి అతని మాట మీద గురి బాగానే వుంటుంది. ఇక పవన్‌కళ్యాణ్ అయితే ఈ లాబీయింగ్ లాంటి వాటికి చాలా దూరం.
ఎప్పుడూ అవార్డుల కోసం లాబీయింగ్ చేసి ఎరుగని పవన్ కోసం ‘అత్తారింటికి దారేది’ బృందం ఎవరూ అవార్డు ఇవ్వాలంటూ రిక్వెస్ట్ పెట్టుకోలేదు. అత్తారింటికి దారేదిలో పవన్ కళ్యాణ్ ఎంతో గొప్పగా నటించేసాడని కాదు కానీ, మిర్చితో పోల్చుకుంటే అత్తారింటికి దారేది హీరోకే అన్ని పార్శ్వాలుంటాయి. లాబీయింగ్‌తో సంబంధం లేకుండా ‘ఉస్తాద్’కి (అభిమానులు పికెని ముద్దుగా పిలుచుకునే పేరు) ఉత్తమ నటుడు అవార్డు వచ్చేస్తుందనుకున్న ఫాన్స్ ప్రభాస్‌కిచ్చేసారని తెలిసి ఉసూరుమన్నారు.
Recent Random Post:

















