మహేష్ బాబుకు కూడా ఇదే తలనొప్పి

ఇప్పుడు టాలీవుడ్లో స్టార్ హీరోలందరికీ హీరోయిన్లను సెట్ చేయడం పెద్ద తలనొప్పి అయిపోతోంది. గత కొన్నేళ్లుగా స్టార్ హీరోలు ప్రధానంగా కాజల్ అగర్వాల్, తమన్నా, సమంత, శ్రుతి హాసన్‌ల చుట్టూనే తిరిగారు. ఐతే ఈ ముగ్గురితోనూ ఒకటికి మించి సినిమాలు చేసేసిన స్టార్లు ఇప్పుడు వేరే హీరోయిన్ల వైపు చూస్తున్నారు. కానీ వాళ్ల స్టేచర్‌కు తగ్గ హీరోయిన్లు సెట్ కావడం లేదు. స్క్రిప్టులు రెడీ అయిపోతున్నాయి. ముహూర్తాలు అయిపోతున్నాయి. షూటింగులు కూడా మొదలైపోతున్నాయి. కానీ హీరోయిన్లెవరూ తేలని సినిమాలు చాలానే ఉంటున్నాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు కొత్త సినిమాకు కూడా ఇదే తలనొప్పి తప్పేలా లేదు.

కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ చేయబోతున్న భరత్ అను నేను (వర్కింగ్ టైటిల్) సినిమాకు కథానాయికగా కీర్తి సురేష్‌ను అనుకున్నట్లుగా ఇంతకుముందు వార్తలొచ్చాయి. దాదాపుగా ఆమె ఫైనలైజ్ అయిపోయింది అనుకుంటుండగా.. ఇప్పుడు ఆమెను కాదని మరో హీరోయిన్‌ కోసం చూస్తున్నట్లు సమాచారం. ఇటీవలే ‘నేను లోకల్’లో మరీ బబ్లీగా కనిపించిన కీర్తిని చూసి మహేష్ పక్కన ఆమె సూటవ్వదేమో అనుకుంటున్నారట. పైగా ఆమె పవన్ కళ్యాణ్ సినిమాలో కూడా నటించబోతుండటం.. వేరే సినిమాలు కూడా రెండు మూడు లైన్లో ఉండటంతో డేట్లు సర్దుబాటు చేయడం కూడా కష్టమయ్యేలా ఉందట. దీంతో కీర్తిని పక్కనబెట్టేసి మరో హీరోయిన్ కోసం చూస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రం మేలో సెట్స్ మీదికి వెళ్లనుంది. ఆలోపు కథానాయికగా ఎవరో ఒకరిని ఫైనలైజ్ చేద్దామని చూస్తున్నాడు  కొరటాల.


Recent Random Post: