
దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యానికి సంబంధించిన మెడికల్ రిపోర్ట్‌ను ఎయిమ్స్ వైద్యులు తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వానికి అందజేశారు. జయలలిత మరణానికి సంబంధించి మిస్టరీ ఉందనీ, అపోలోలో ఆమెకు అందించిన చికిత్స వివరాలపై న్యాయవిచారణ జరిపించాలన్న డిమాండ్ నేపథ్యంలో అపోలో ఆసుపత్రి ఆ చికిత్స వివరాలను ప్రభుత్వానికి సమర్పించింది. ఈ నివేదిక అందించిన అనంతరం ఎయిమ్స్ డిప్యూటీ డైరక్టర్ వీ. శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. గత ఏడాది సెప్టెంబర్ 22న జయలలితను అపోలో ఆసుపత్రికి తీసుకువచ్చే సమయానికి ఆమె శ్వాస తీసుకోవడలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అప్పటి నుంచి ఆమెకు అపోలో ఆసుపత్రిలో నిపుణులైన వైద్యులతో పాటు, ప్రభుత్వం కోరిక మేరకు ఎయిమ్స్ నుంచివ వైద్యుల బృందాన్ని రప్పించినట్లు వివరించారు.
చెన్నై అపోలో ఆస్పత్రిలో 72 రోజుల చికిత్స తర్వాత డిసెంబర్ 4వ తేదీన గుండెపోటు రావడంతో జయలలిత మృతిచెందారని తెలిపారు. ఎక్మో సపోర్ట్ అందించినా.. జయలలితను కాపాడుకోలేకపోయామన్నారు. ఈ విషయాన్ని అప్పటి సీఎం పన్నీర్‌సెల్వంతో పాటు సీనియర్ నేతలకు తెలిపామని తమిళనాడు ప్రభుత్వం తెలిపింది. కాగా, అనారోగ్యం వల్ల అపోలో ఆస్పత్రిలో జయ చికిత్స పొందిన సమయంలో ఎయిమ్స్ వైద్యులు కూడా ఆమెకు చికిత్సను అందించారు. ఎయిమ్స్ వైద్యులు సుమారు అయిదుసార్లు చెన్నైకు వెళ్లారు. దివంగత సీఎం ఆరోగ్యంపై ఎయిమ్స్ వైద్యులు విశ్లేషణాత్మక నివేదిక తయారు చేసినట్లు తెలుస్తున్నది. అధికారిక రికార్డు కోసం డాక్టర్ల వివారాలను తెలుసుకునేందుకు తమిళనాడు ప్రభుత్వం రిపోర్ట్ సేకరించింది.
ఎయిమ్స్ వైద్యుల నివేదికను తమిళనాడు ఆరోగ్యశాఖ కార్యదర్శి రాధాకృష్ణనన్‌కు అందజేశారు. గత ఏడాది జయ అపోలో ఆస్పత్రిలో ఉన్నప్పుడు అక్టోబర్ 5వ తేదీ నుంచి డిసెంబర్ 6వ తేదీ వరకు ఎయిమ్స్ వైద్యులు ఆమెను సందర్శించారు. పల్మోనాలజీ ప్రొఫెసర్ డాక్టర్ జేసీ ఖిల్‌నాని నేతృత్వంలో ఎయిమ్స్ బృందం చెన్నైలో పర్యటించింది. జయ మృతిపై అనుమానాలు ఉన్నట్లు డీఎంకే ఇప్పటికే మద్రాసు హైకోర్టును ఆశ్రయించింది. మరోవైపు మాజీ సీఎం పన్నీరుసెల్వం వర్గం కూడా జయ మృతి పట్ల విచారణ నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు.
Recent Random Post:

















