
సింగర్ సుచిత్ర కార్తీక్ వ్యవహారం తమిళ చిత్ర పరిశ్రమలో కలకలం సృష్టించింది. ఆమె తమిళ రంగానికి చెందిన పెద్ద తలకాయలతోనే పేచీ పెట్టుకుని, వారి మీద దారుణమైన ఆరోపణలు చేయడంతో ఒక్కసారిగా అందరి దృష్టి తమిళ రంగం వైపు తిరిగింది. సుచిత్ర ఆరోపణలు చేస్తోన్న వారిలో ధనుష్ చిన్నవాడేం కాదు. సాక్షాత్తూ రజనీకాంత్‌కి అల్లుడు. అలాగే తమిళ చిత్ర సీమలో ఒక పేరున్న స్టార్.
ఇక అతనికి అత్యంత సన్నిహితుడు, తమిళ చిత్ర రంగాన్ని శాసిస్తున్న సంగీత దర్శకుడు అనిరుధ్ కూడా సుచీ లీక్స్‌లో కీలక పాత్రధారి. వీరిద్దరిపై సుచిత్ర చేసిన ఆరోపణలు అలా ఇలా లేవు. తన అకౌంట్ హ్యాక్ అయిందని అంటూనే ఆమె వారిపై షాక్‌కి గురి చేసే అభియోగాలు మోపింది. తనకి మత్తు ఇచ్చి ఇద్దరూ తనతో సెక్స్‌లో పాల్గొన్నారని, వీడియోలు తీసారని సుచిత్ర ట్వీట్స్ వేసి, డిలీట్ చేసింది. వాళ్లిద్దరూ ఫలానా వారితో సెక్స్‌లో పాల్గొన్నారంటూ పేర్లతో సహా ప్రకటించింది. ఆ వీడియోలు వదుల్తానంటూ ఆమె హెచ్చరించే సరికి సుచిత్ర ట్విట్టర్ అకౌంటే క్లోజ్ అయింది.
మొదట్లో ఆమె అకౌంట్ హ్యాక్ అయిందని చెప్పిన ఆమె భర్త కార్తీక్ కుమార్ తర్వాత మానసిక స్థితి వల్ల అలా చేస్తోందని చెప్పాడు. అయితే తన అకౌంట్ హ్యాక్ అయిందని ఇప్పటికీ సుచిత్ర చెప్తోంది. మరి ఇద్దరిలో ఎవరి మాటలు నమ్మాలో అర్థం కాని పరిస్థితి. మరోవైపు తన భర్తతో విడాకులకి సుచిత్ర అప్లయ్ చేసింది. అలాగే తన ప్రాణాలకి ముప్పు పొంచి వుందని, తనని బెదిరిస్తూ కొందరు ఇంటికే వచ్చేస్తున్నారని ఆమె అంటోంది. అయితే ప్రస్తుతమున్న సిట్యువేషన్లో సుచిత్ర జోలికి పోవడానికి ఎవరూ సాహసించకపోవచ్చు. ఆమెకి ఇప్పుడు ఏమి జరిగినా అందరి అనుమానాలు ఇద్దరి మీదకే మళ్లుతాయి. అయితే ఆమె భర్తని ఇన్ఫ్లుయన్స్ చేసి విడాకుల వరకు దారి తీసేలా చేయడంలోను వాళ్ల హస్తముందనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
Recent Random Post: