
కొంచెం గ్యాప్ తర్వాత కలర్స్ పాప స్వాతి మళ్లీ తెలుగులో బిజీ అయ్యేలా కనిపిస్తోంది. ఆదిత్య అనే కొత్త దర్శకుడు రూపొందించనున్న ఒక రొమాంటిక్ మూవీలో ‘గుంటూరు టాకీస్’ ఫేమ్ సిద్ధుతో స్వాతి జత కట్టబోతున్న సంగతి తెలిసిందే. దీంతో పాటు తెలుగులో స్వాతి ఇంకో సినిమా కమిటైంది.
తమిళంలో సూపర్ హిట్టయిన ‘ఆండవన్ కాట్టలై’ అనే సినిమాను తెలుగులోకి రీమేక్ చేస్తుండగా అందులో స్వాతినే కథానాయికగా ఎంపికైంది. రక్షక్ అనే కొత్తబ్బాయి ఇందులో హీరోగా నటిస్తుండటం విశేషం. ‘వీడు తేడా’.. ‘బ్రదర్ ఆఫ్ బొమ్మాళి’ లాంటి సినిమాలు తీసిన చిన్నికృష్ణ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. ఆల్రెడీ ఈ సినిమా చడీచప్పుడు లేకుండా సెట్స్ మీదికి కూడా వెళ్లిపోయినట్లు సమాచారం.
గత ఏడాది తమిళంలో ‘కాకా ముట్టై’ అనే సినిమాకు జాతీయ అవార్డు రావడం గుర్తుండే ఉంటుంది. ఆ చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన మణికందన్ రూపొందించిన సినిమా ‘ఆండవన్ కాట్టలై’. విజయ్ సేతుపతి కథానాయకుడిగా రూపొందించిన ఈ చిత్రం దళారుల వ్యవస్థ మీద పోరాటం నేపథ్యంలో సాగుతుంది. తమిళంలో ఈ చిత్రం మంచి విజయమే సాధించింది. తమిళంలో ఎస్టాబ్లిస్డ్ హీరో, అప్ కమింగ్ హీరోయిన్ (రితికా సింగ్) జంటగా నటిస్తే.. తెలుగులో కొత్త హీరో, సీనియర్ హీరోయిన్ జంటగా కనిపించబోతుండటం చిత్రమే.
Recent Random Post: