
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ లో ఆయనకున్న డిమాండ్ అంతాఇంతా కాదు. ఆయన కానీ మూవీ ఓకే అంటే.. నిర్మాతకు కాసుల వర్షం కురిసినట్లే. ఈ మధ్యన నిర్మాత బండ్ల గణేశ్ ఇంటర్వ్యూ లో చెప్పిన మాట ఒకటి ఇక్కడ ప్రస్తావించాలి. తాను చాలా చిన్న స్థాయి నుంచి ఎదిగినా.. తాను సినిమాలు తీసినా. తన మీద పవన్ కల్యాణ్ అనే ఫ్లడ్ లైట్ పెరిగిన తర్వాత తనకు తిరుగులేకుండా పోయిందని.. పెద్ద హీరోల డేట్లు పట్టుకోవటం అదో అర్ట్ గా చెప్పుకొచ్చారు.
పెద్ద హీరో తో సినిమా చేయటం ఎంత కష్టమన్న విషయాన్ని బండ్ల చెప్పకనే చెప్పేశారు. అగ్రహీరో ఓకే చెప్పేసిన తర్వాత ఫోకస్ అంతా ఆయన మీదనే పెడతారు కానీ.. ఏ నిర్మాత కూడా తన మీద పెట్టుకోవటం కనిపించదు.కానీ.. ఈ మధ్య కాలంలో కాటమరాయుడు సినిమా నిర్మాత శరద్ మురారి యవ్వారం కాస్త తేడా ఉందన్నమాట వినిపిస్తోంది.
కాటమరాయుడు సినిమా ప్రమోషన్ కోసం విడుదల చేసే ఫోటోల్లో ఈ మధ్యన ఆయన ఉన్న ఫోటోల్ని ఎక్కువగా పంపుతున్నట్లుగా జర్నలిస్ట్ వర్గాల టాక్ గా చెప్పాలి. విడుదలకు దగ్గర పడుతున్న వేళ.. సినిమా మీద మరింతఆసక్తి పెరిగేలా ప్రచారాన్ని ముమ్మరం చేయాల్సిన వేళ.. హీరోతోనూ.. హీరోయిన్ తోనూ వర్కింగ్ స్టిల్స్ పేరిట తాను ఉన్న ఫోటోల్ని మీడియాకు పంపుతున్న శరద్ మురార్ వ్యవహారశైలిపై ఆసక్తికర చర్చ సాగుతోంది. సినిమా మీదా.. హీరో మీద ఫోకస్ కంటే తన ఇమేజ్ ను పెంచుకునే వైనంపై శరద్ పెడుతున్న శ్రద్ధ వెనుక పరమార్థం ఏమిటో..?
Recent Random Post: