బాహుబలి ఓకే, భాగ్‌మతిని లాగేదెవరు?

బాహుబలి 2′ సినిమాలో అనుష్క సన్నగా కనిపించడం పట్ల చాలా అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఫోటోషాప్‌ వాడారనే కామెంట్లు వచ్చాయి. రాజమౌళి కూడా వాటికి కాదని చెప్పలేదు. నిజంగానే తనని సన్నగా చూపించడానికి ఫోటోషాప్‌ సాయం తీసుకున్నామని, అలాగే సినిమాలో కూడా ఆమె సన్నగా కనిపించేందుకు విఎఫ్‌ఎక్స్‌ వాడుతున్నామని ఓపెన్‌గా చెప్పేసాడు. బాహుబలి సినిమా చేస్తుండగా, వేరే ప్రాజెక్టుల విషయంలో కేర్‌ఫుల్‌గా వుండాలని రాజమౌళి ఆదినుంచి చెబుతున్నా కానీ వినకుండా సైజ్‌ జీరో కోసం ఆకారం మార్చుకున్న అనుష్క మళ్లీ పూర్వ రూపం సంతరించుకోలేకపోయింది.

ఈలోగా సింగం 3 షూటింగ్‌లో గాయపడడంతో బెడ్‌ రెస్ట్‌ తీసుకుని పూర్తిగా షేపవుట్‌ అయింది. బరువు తగ్గలేకపోయిన అనుష్క విషయంలో రాజమౌళి కోప్పడ్డాడని కూడా వార్తలొచ్చాయి. అయితే తనకోసం షూటింగ్‌ ఆపలేక అలాగే సినిమా తీసేసి, ఇప్పుడు గ్రాఫిక్స్‌తో తనని సన్నగా చూపిస్తున్నారు. బాహుబలి అంటే అన్ని వందల కోట్ల సినిమా కనుక గ్రాఫిక్స్‌పై మరో రెండు, మూడు కోట్లు ఖర్చు పెట్టడం వారికి అంత లెక్క కాదు. కానీ అనుష్క లీడ్‌ రోల్‌ చేస్తోన్న భాగ్‌మతి సినిమా సంగతేంటి? ఈ చిత్రానికి గ్రాఫిక్స్‌ ఎలా వాడతారు? అనుష్కని సన్నగా ఏ విధంగా చూపిస్తారు? ప్రస్తుతం వున్న రూపుతో షూటింగ్‌ కంటిన్యూ చేయడం కష్టమని భావించి ఆమెకి కొద్ది రోజుల విరామం ఇచ్చారట. అందుకే షూటింగ్‌ వాయిదా వేసుకున్నారట.

ఆమె ఎంత త్వరగా బరువు తగ్గితే అంత త్వరగా ఈ చిత్రం షూటింగ్‌ మళ్లీ మొదలవుతుంది. ఏదేమైనా ఇలాంటి వార్తల వల్ల ఇకపై అనుష్కని కాస్ట్‌ చేయాలనే వారు కంగారు పడే అవకాశముంది. ఈ సమస్యలకి శాశ్వత పరిష్కారాన్ని స్వీటీ ఎప్పటికి కనిపెడుతుందో ఏమిటో?


Recent Random Post: