
పెద్ద నోట్ల రద్దుతో పెద్ద పెద్ద యాపారాలే సరిగా సాగక కిందామీదా పడిపోతున్న వేళ.. ఆ ప్రభావం సినిమా రంగం మీద పడి.. బొమ్మ బాగున్నా.. థియేటర్ కు వెళ్లటానికి ఆచితూచి అడుగులు వేస్తున్న పరిస్థితి. హిట్ టాక్ తెచ్చుకున్నతెలుగు సినిమాలకు కాసుల వర్షం కురవక.. నిర్మాతలు కిందామీదా పడుతున్న పరిస్థితి.
అలాంటి వేళ.. అమీర్ ఖాన్ లాంటోడి సినిమా బయటకు వస్తుందంటే చాలానే భయాలు బయటకు వచ్చాయి. భారీ బడ్జెట్ తోరూపొందించిన ఈ సినిమా లెక్క విషయంలో ఏ మాత్రం తేడా కొట్టినా.. కోట్లాదిరూపాయిలు దెబ్బేస్తాయన్న అంచనాలు వినిపించాయి. అయితే.. మిగిలిన వారికి అప్లై అయ్యేదేదీ అమీర్ ఖాన్ కు అప్లై కాదన్న విషయాన్ని స్పష్టం చేసింది దంగల్.
పెద్దనోట్ల రద్దు తర్వాత మరే సినిమాకు జరగనంత బిజినెస్ ఈ సినిమాకు జరగటమే కాదు..వందకోట్లు.. నూటయాభై కోట్లు.. ఇప్పుడు రెండు వందల కోట్ల దిశగా పరుగులు పెడుతోంది. తొలి ఐదు రోజుల కలెక్షన్లను చూస్తే.. బాక్సీఫీస్ దగ్గర అమీర్ స్టామినా ఏమిటో తెలిసేలా చేస్తుందని చెబుతున్నారు. స్వదేశంలోనే కాదు విదేశంలోనూ దంగల్ దూసుకెళుతోంది.
దేశవ్యాప్తంగా తొలిరోజు రూ.29.78 కోట్లతో ఖాతా తెరిచిన దంగల్.. రెండో రోజు (శనివారం) రూ.34.82 కోట్లు.. మూడో రోజు (ఆదారం)రూ.42.35 కోట్లు.. నాలుగు రోజు(సోమవారం) రూ.25.48కోట్లు.. ఐదో రోజు (మంగళవారం) రూ.23.07 కోట్లతో మొత్తం రూ.155.53 కోట్లను కొల్లగొట్టినట్లుగా చెబుతున్నారు. ఇదంతా కూడా అప్పటికప్పుడు అందిన సమాచారంతో వేసిన లెక్కలుగా.. వాస్తవ లెక్కలు మరింత ఎక్కువగా ఉంటాయని చెబుతున్నారు. మరో రోజులో న్యూఇయర్ బాష్ మొదలవుతున్న వేళ.. బాక్స్ ఫీస్ దగ్గర దంగల్ కలెక్షన్ల దుమ్ము రేపటం ఖాయమన్న మాట వినిపిస్తోంది.
Recent Random Post: