రత్తాలు రత్తాలు.. అంటున్న చిరు

మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ మూవీ ‘ఖైదీ నెంబర్ 150’ ప్రమోషన్ ప్లాన్స్ అదిరిపోతున్నాయి. ఆడియో వేడుక చేసి.. ఒకేసారి ఆడియో రిలీజ్ చేసి ఉంటే.. ఆ రోజుకు మాత్రమే వార్తల్లో ఉండేది ‘ఖైదీ నెంబర్ 150’. అలా కాకుండా రెండు మూడు రోజుల గ్యాప్‌లో ఒక్కో పాట రిలీజ్ చేస్తూ సినిమాను వార్తల్లో నిలబెడుతున్నారు. ఇప్పటికే ఈ సినిమాలోని మూడు పాటల్ని రిలీజ్ చేశారు. అందులో చివరగా వచ్చిన ‘యు అండ్ మి’ పాటకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అమ్మడు లెట్స్ డు కుమ్ముడు.. సుందరీ పాటల్ని కూడా బాగానే రిసీవ్ చేసుకున్నారు. ఇప్పుడు సినిమాలో హైలైట్ గా నిలిచే ఇంకో పాటను రిలీజ్ చేస్తున్నారు.

‘ఖైదీ నెంబర్ 150’ కోసం లక్ష్మీ రాయ్‌తో కలిసి చిరు ఒక ఐటెం సాంగ్ చేసిన సంగతి తెలిసిందే. ఆ పాటను డిసెంబరు 31న రిలీజ్ చేయనున్నారు. రత్తాలు రత్తాలు.. అంటూ సాగుతుందీ పాట. ఈ పాట లిరికల్ వీడియోను శనివారం రిలీజ్ చేసి.. అదే రోజు రాత్రికి ఆడియోను పూర్తిగా మార్కెట్లోకి వదిలేయబోతున్నారు. ఫుల్  జ్యూక్ బాక్స్ వెంటనే అందుబాటులోకి వస్తుంది. ఐటెం సాంగ్స్ చేయడంలో దేవిశ్రీ ప్రసాద్ అందె వేసిన చేయి అన్న సంగతి తెలిసిందే. ఇంతకుముందు చిరుకు చేసిన ఐటెం సాంగ్స్ అదిరిపోయాయి. ఇప్పుడు రత్తాలు రత్తాలు కూడా అదే స్థాయిలో ఆకట్టుకుంటుందని అంచనా వేస్తున్నారు. జనవరి 4న ప్రి రిలీజ్ ఈవెంట్ చేసి.. 11న ‘ఖైదీ నెంబర్ 150’ని రిలీజ్ చేయాలని భావిస్తున్నారు.


Recent Random Post: