‘గురు’ గుట్టు ట్రైలర్లో తెలిసిపోయింది

విక్టరీ వెంకటేష్ కొత్త సినిమా ‘గురు’ మీద మొదట్నుంచి పాజిటివ్ బజ్ ఉంది. దీని టీజర్ చూశాక సినిమాపై అంచనాలు పెరిగాయి. తాజాగా రిలీజైన ట్రైలర్ కూడా ఆసక్తికరంగా ఉంది. కాకపోతే ‘గురు’ ఒరిజినల్ ‘సాలా ఖడూస్/ఇరుదు సుట్రు’ చూసిన వాళ్లకు మాత్రం ఈ ట్రైలర్ ఏమంత ఎగ్జైటింగ్‌గా అనిపించకపోవచ్చు. ఎందుకంటే షాట్ టు షాట్ దించేసినట్లే ఉంది తప్ప.. మార్పులేమీ చేసినట్లుగా అనిపించట్లేదు. ఐతే రితిక తెలుగులోనూ అదరగొట్టేసినట్లే ఉంది. మాధవన్‌కు దీటుగా వెంకీ కూడా మంచి పెర్ఫామెన్స్ ఇచ్చినట్లున్నాడు. ఆయనకు ఈ గెటప్.. ఈ క్యారెక్టర్ బాగా సూటైనట్లు కనిపిస్తోంది.

ఇక ‘గురు’ షూటింగ్ దశలో ఉండగా ఒక రూమర్ వచ్చిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఒరిజినల్లోని 15 నిమిషాల నిడివిని యథాతథంగా తెలుగు వెర్షన్ కోసం తీసుకున్నారని.. ఆ సన్నివేశాల్ని మళ్లీ తీయలేదని చెప్పుకున్నారు అప్పట్లో. ‘గురు’ ట్రైలర్ చూస్తే అది నిజమే అనిపిస్తోంది. హీరో ప్రమేయం లేకుండా హీరోయిన్ సోలోగా ఉండే కొన్ని సన్నివేశాల్ని ఒరిజినల్ నుంచి తీసుకున్నట్లు ట్రైలర్‌తోనే స్పష్టం అయిపోయింది. మొత్తంగా సినిమా అంతా కూడా తమిళానికి డిట్టో లాగే అనిపిస్తోంది. ఐతే ఇలాంటి కాన్సెప్ట్ బేస్డ్ సినిమాల్లో మార్పులేమీ అవసరం లేదని ‘గురు’ టీం భావించి ఉండొచ్చు. తమిళ.. హిందీ భాషల్లో మంచి విజయం సాధించిన ఈ చిత్రం తెలుగులో ఏప్రిల్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.


Recent Random Post: