
మామూలుగా తమ సినిమాలు రిలీజవుతున్నపుడు మన హీరోలు ఎగ్జైట్మెంట్లో ఉంటారు. హైదరాబాద్ లోనే ఉండి సినిమా రిపోర్ట్స్ ఫాలో అవుతూ ఉంటారు. సినిమా విడుదలకు ముందు.. వెనుక ప్రమోషన్లలోనూ పాల్గొంటారు. కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇందుకు భిన్నం. ఆయన తన సినిమాలు రిలీజవుతున్నపుడు ఏమీ పట్టనట్లు కనిపిస్తాడు. పవన్ అసలెక్కడున్నాడో తెలియదు. అసలతు అడ్రస్ ఉండడు. తాజాగా ‘కాటమరాయుడు’ రిలీజ్ టైంలోనూ పవన్ ఇక్కడ లేడు. ముందు రోజు పవన్ పుణెలో తన కూతురు ఆధ్య దగ్గర ఉండటం విశేషం. మార్చి 23న ఆధ్య పుట్టిన రోజు. ఆ వేడుకల్లోనే గడిపాడు పవన్.
రేణు దేశాయ్ నుంచి విడిపోయినప్పటికీ పవన్.. అప్పుడప్పుడూ పుణెకు వెళ్లి తన పిల్లలు అకీరా నందన్.. ఆధ్యలతో గడిపి వస్తాడన్న సంగతి తెలిసిందే. వాళ్లతో కలిసి డిన్నర్లకు వెళ్లడం.. ఇంట్లో సరదాగా గడపడం చేస్తుంటాడు పవన్. ప్రతిసారి పిల్లల పుట్టిన రోజు వేడుకల్లోనూ పాల్గొంటాడు. ఆధ్య పుట్టిన రోజుకు కూడా అలాగే హాజరయ్యాడు. దీనికి సంబంధించిన ఫొటోలు చూస్తే పవన్ అక్కడ చాలా ఉల్లాసంగా గడిపినట్లు అర్థమవుతోంది. పవన్.. రేణు ఆధ్యకు తలోవైపు నిలబడి కేక్ కట్ చేయించారు. అనంతరం ఈ వేడుకకు హాజరైన పిల్లలతో కలిసి ఫొటోలు కూడా దిగాడు పవన్. గత కొన్ని రోజులుగా బయటెక్కడా కనిపించని పవన్.. ఇప్పుడు గడ్డంతో దర్శనమివ్వడం విశేషం. మరి ఈ లుక్ క్యాజువలా లేక త్రివిక్రమ్ తో చేయబోయే కొత్త సినిమా కోసమా?
Recent Random Post: