‘నెక్స్‌ట్‌ రవితేజ’కి ఇదే టార్గెట్‌ మరి

మాస్‌ మహారాజా రవితేజకి రీప్లేస్‌మెంట్‌గా ట్రేడ్‌తో పాటు సినిమా ఇండస్ట్రీ కూడా పరిగణిస్తోన్న సాయిధరమ్‌ తేజ్‌ ఇప్పటికే హీరోగా తన సత్తా చాటుకున్నాడు. సుప్రీమ్‌తో ఫస్ట్‌ సూపర్‌హిట్‌ అందుకున్న తేజు ఇక ఓపెనింగ్స్‌ పరంగా తన స్టామినా చూపించి నెక్స్‌ట్‌ రవితేజా కాదా అనేది తేల్చి పారేయాలి.

మీడియం రేంజ్‌ హీరోలు ఇప్పుడు చాలా మందే వున్నారు కానీ రవితేజలా నిఖార్సయిన ఓపెనింగ్స్‌ తెచ్చి పెట్టే వాళ్ల సంఖ్య తక్కువే వుంది. రవితేజ సినిమాలకి అయిదున్నర కోట్ల ఫస్ట్‌ డే షేర్‌ ఖాయంగా వచ్చేస్తుంది. ఒక హీరో రేంజ్‌ని తేల్చేది మొదటి రోజు కలక్షన్లే కనుక మిడ్‌ రేంజ్‌లో తనతో పోటీ వచ్చే కుర్రాళ్లు ఎవరూ లేరనే చెప్పాలి.

ఇప్పుడు సాయిధరమ్‌ తేజ్‌ ‘విన్నర్‌’కి అదే టార్గెట్‌. అయిదున్నర కోట్ల నుంచి ఆరు కోట్ల తొలి రోజు షేర్‌ వచ్చిందంటే ఇక నెక్స్‌ట్‌ మాస్‌ మహారాజాగా తేజు ఫిక్స్‌ అయిపోయినట్టే. విన్నర్‌ సినిమాకి మహా శివరాత్రి రోజున విడుదల కావడం ప్లస్‌ అవుతుంది.

హాలిడే రిలీజ్‌ వల్ల తొలి రోజు వసూళ్లకి ఢోకా వుండదని ట్రేడ్‌ చెబుతోంది. అతని సినిమాల్లోనే ఇది భారీ బడ్జెట్‌ చిత్రం కావడం వల్ల మొదటి రోజు అంచనాలకి మించి పర్‌ఫార్మ్‌ చేయడం విన్నర్‌కి చాలా కీలకం. సాయిధరమ్‌ తేజ్‌ స్టార్‌డమ్‌ని డిసైడ్‌ చేసే ఈ పరీక్షలో అతను ఎంతవరకు నెగ్గుతాడనేది చూడాలి.


Recent Random Post: