అల్లరి ‘నాంది’ విడుదల తేదీ ఖరారు

అల్లరి నరేష్‌ హీరోగా విజయ్‌ కృష్ణ దర్శకత్వంలో రూపొందిన నాంది సినిమా గత ఏడాదిలోనే విడుదల కావాల్సి ఉన్నా కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. ఈ సినిమాను డైరెక్టర్ ఓటీటీకి విడుదల చేయాలని భావించారు. కాని థియేటర్లు ఇటీవలే మళ్లీ పునః ప్రారంభం అవుతున్న నేపథ్యంలో సినిమాను థియేటర్‌ రిలీజ్ కు సిద్దం చేశారు. నాంది సినిమా విడుదల తేదీ విషయంలో గత కొన్ని రోజులుగా నెలకొని ఉన్న సస్పెన్స్‌ కు తెర పడింది. ఈ నెల 19వ తారీకున ఈ సినిమాను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది.

ఇప్పటికే విడుదల అయిన టీజర్ మరియు ఫస్ట్‌ లుక్‌ పోస్టర్ సినిమాపై అంచనాలు పెంచింది. మొదటి సారి అల్లరి నరేష్‌ పూర్తి స్థాయి సీరియస్ రోల్‌ లో కనిపించబోతున్న ఈ సినిమా విడుదల విషయమై నెలకొన్న సస్పెన్స్ కు తెర దించిన యూనిట్‌ సభ్యులు ఈనెల 19న విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించారు. ఈ సినిమాలో కీలక పాత్రను తమిళ స్టార్‌ నటి వరలక్ష్మి శరత్‌ కుమార్‌ చేస్తుండటంతో పాటు నరేష్ న్యూడ్‌ పాత్రలో కనిపించబోతున్న నేపథ్యంలో అంచనాలు భారీగా ఉన్నాయి. మరి అంచనాలకు తగ్గట్లుగా ఈ సినిమా ఉందా అనేది చూడాలి.