బన్నీ, పవన్ ఫ్యాన్స్ వార్ కు పుల్ స్టాప్ పడనుందా..?

కట్టలు కట్టలుగా ఉన్న మెగా హీరోల మధ్య సంబంధాలు ఎలా ఉన్నాయో కానీ వారి అభిమానుల మధ్య అంత పొంతన ఉండడం లేదు. ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాన్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులకు అస్సలు పొసగదన్న సంగతి తెలిసిందే. కొన్ని రోజులుగా జరుగుతున్న ఈ రగడకు పుల్ స్టాప్ పెట్టేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయట.  తాజాగా అల్లు అర్జున్ కొత్త చిత్రం ‘డీజే (దువ్వాడ జగన్నాథం)’ టీజర్ కు డిస్ లైక్స్ రావడానికి కారణం పవన్ అభిమానులేనంటూ బన్నీ అభిమానులు ఆరోపిస్తున్నారు.

‘కాటమరాయుడు’ టీజర్ కు కూడా ఇదే తరహాలో డిస్ లైక్స్ వచ్చాయని, ఈ పని బన్నీ అభిమానులే చేశారని పవన్ ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు.  ఈ నేపథ్యంలో ఇద్దరు హీరోల అభిమానుల గొడవలకు ఫుల్ స్టాప్ పెట్టేందుకు ప్రముఖ నిర్మాత, బన్నీ తండ్రి అల్లు అరవింద్ రంగంలోకి దిగినట్లు ఫిల్మ్ నగర్ వర్గాల ద్వారా తెలుస్తోంది.

ఈ సమస్యకు తక్షణం పరిష్కారం చూడకపోతే, ‘డీజే’ సినిమాకు నెగెటివ్ ప్రచారం మరింతగా పెరిగిపోయే ప్రమాదం ఉందని అరవింద్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి ఫుల్ స్టాప్ పెట్టే ఉద్దేశంతో, ‘డీజే’ సినిమాలోని ఓ పాటను పవన్ కల్యాణ్ చేతుల మీదుగా ఓ పాటను విడుదల చేయించాలని అరవింద్ ప్రయత్నిస్తున్నట్టు సమాచారం.

దీంతో పవర్ స్టార్ అభిమానులను శాంతింపజేయవచ్చని ఆయన భావిస్తున్నారు. అంతే కాకుండా, ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి, నాగబాబుల దృష్టికి తీసుకువెళ్లి, వారి సహకారాన్ని తీసుకోవాలని అరవింద్ చూస్తున్నట్లు తెలుస్తోంది. మరి పవన్.. అల్లు మాటలు, అన్నయ్య మాటలు విని వస్తాడో లేదో చూడాలి.


Recent Random Post: