మునుపెన్నడు చూడని బన్నీ

అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప సినిమాపై రోజు రోజుకు అంచనాలు పెరుగుతూనే ఉన్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా దర్శకుడు సుకుమార్‌ ఈ సినిమాను రూపొందిస్తున్నాడు. ఈ సినిమాలో పుష్ప పాత్ర గురించి పదే పదే సోషల్‌ మీడియాలో చర్చ జరుగుతూనే ఉంది. సినిమాలో బన్నీ నెగటివ్‌ షేడ్స్‌ లో కనిపించబోతున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి. అల్లు అర్జున్‌ లుక్‌ ఇప్పటికే మాస్‌ ఆడియన్స్‌ కు కనెక్ట్‌ అయ్యేలా ఉంది. బన్నీ గతంలో ఎప్పుడు కూడా మరీ ఇంత మాసీ లుక్‌ లో కనిపించలేదు.

ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం అల్లు అర్జున్‌ ను సుకుమార్‌ ఈ సినిమాలో గతంలో ఎప్పుడు చూడని విధంగా చూపించబోతున్నాడట. పుష్ప పాత్రలో నెగటివ్‌ ఛాయలు ఎక్కువగా ఉంటాయని అంటున్నారు. అల్లు అర్జున్‌ చేస్తున్న పుష్ప పాత్ర గతంలో ఎప్పుడు తెలుగు సినిమాల్లో చూడని విధంగా ఉంటుందని అంటున్నారు. అద్బుతమైన సినిమా గా పుష్ప నిలుస్తుందనే నమ్మకంను ఇండస్ట్రీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం సినిమా కోసం సరికొత్త యాక్షన్‌ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. రెండు పార్ట్‌ లుగా రూపొందుతున్న పుష్ప మొదటి పార్ట్‌ ను ఈ ఏడాది చివర్లో విడుదల చేసేలా ప్లాన్‌ చేస్తున్నారు.