పవన్‌కళ్యాణ్‌ బాంబుతో బెంబేలెత్తిపోయారు

త్రివిక్రమ్‌తో ప్రస్తుతం చేస్తోన్న సినిమాతో బిజీగా వున్న పవన్‌కళ్యాణ్‌ ఇది పూర్తయిన తర్వాత రెండేళ్ల పాటు పూర్తిగా నటనకి దూరంగా వుంటాడని రూమర్స్‌ వినిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల బరిలో దిగబోతున్న జనసేన అధినేతకి ఎక్కువ సమయం లేదు. ఇంతవరకు తన పార్టీని జనంలోకి తీసుకెళ్లడానికి, దానిని నిర్మించడానికి పవన్‌ పూర్తి సమయం కేటాయించలేదు.

ఇక ఎక్కువ సమయం లేదు కనుక త్రివిక్రమ్‌ చిత్రం తర్వాత పవన్‌ బ్రేక్‌ తీసుకోక తప్పదు. ఈ నేపథ్యంలో పవన్‌ కోసమే ఎదురు చూస్తోన్న ఎ.ఎం. రత్నం క్యాంప్‌లో బాంబు పడింది. పవన్‌ సినిమా వెనక వున్నదని చెప్పి ‘ఆక్సిజన్‌’ చిత్రాన్ని అమ్మడానికి రత్నం ప్రయత్నిస్తున్నాడు.

అయితే పవన్‌ చిత్రం షూటింగ్‌ మొదలైతే కానీ బయ్యర్లు ఈ గాలానికి పడేలా లేరు. అసలే ఈ ప్రాజెక్టుపై అనుమానాలు వ్యక్తమవుతూ వుండగా, ఇది కాన్సిల్‌ అయిపోయిందనే వార్త ఒకటి మీడియాలో ప్రత్యక్షమయింది. దాంతో ఆక్సిజన్‌ యూనిట్‌కి ఆక్సిజన్‌ అందనంత పనయింది. విడుదలకి దగ్గరగా వచ్చిన టైమ్‌లో లైఫ్‌లైన్‌లాంటి పవన్‌ సినిమాని కాన్సిల్‌ చేసేసారంటే మళ్లీ కథ మొదటికి వస్తుంది.

అందుకే ఈ వార్త మీడియాలో రాగానే డైరెక్టర్‌ నీసన్‌ ఈమధ్యే పవన్‌ని కలిసి పూర్తి కథ వినిపించాడని, పవన్‌కి అది బాగా నచ్చిందని మీడియాకి న్యూస్‌ లీక్‌ చేసారు. రాజకీయాలకి పవన్‌కి సమయం లేని తరుణంలో ఇలాంటి ఎన్ని లీకులైనా నమ్మశక్యంగా అనిపించవు, ఇప్పటికిప్పుడు ఈ చిత్రాన్ని పవన్‌ మొదలు పెడితే తప్ప.


Recent Random Post: