బాలయ్య సినిమా.. రావిపూడి ఆ క్లారిటీ ఇచ్చాడు

నందమూరి బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక సినిమా రూపొందబోతున్న విషయం తెల్సిందే. ఇప్పటి వరకు అపజయం అంటూ ఎరగని అనిల్ రావిపూడి త్వరలో ఎఫ్ 3 సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఖచ్చితంగా ఎఫ్ 3 కూడా ఎఫ్ 2 తరహాలో ఒక పక్కా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా నిలుస్తుందనే నమ్మకం ప్రతి ఒక్కరిలో కూడా ట్రైలర్ చూసిన తర్వాత కనిపిస్తుంది.

ఎఫ్ 3 సినిమా తర్వాత అనిల్ రావిపూడి చేయబోతున్న సినిమా పై అందరి ఆసక్తి నెలకొంది. అఖండ వంటి భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న బాలయ్య తో అనిల్ రావిపూడి సినిమా చేయబోతున్నాడు. ప్రస్తుతం బాలయ్య చేస్తున్న సినిమాకు గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న విషయం తెల్సిందే. ఆ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది.. తుది దశకు చేరుకుందనే సమాచారం అందుతోంది.

బాలయ్య.. అనిల్ రావిపూడి సినిమా జులై లేదా ఆగస్టు లో మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. బాలకృష్ణ అంటే మాస్ డైలాగ్స్ మరియు మాస్ యాక్షన్ సన్నివేశాలను అభిమానులు కోరుకుంటారు. అలా కాదని ఆయనతో ఎఫ్ 2 లేదా ఎఫ్ 3 కామెడీ చేయిస్తానంటే మాత్రం ఖచ్చితంగా ప్రేక్షకులు ముఖ్యంగా నందమూరి అభిమానులు తిరష్కరించే అవకాశం ఉంది.

ఆ విషయంలో దర్శకుడు అనిల్ రావిపూడి క్లారిటీ ఇచ్చాడు. బాలయ్య బాడీ లాంగ్వేజ్ కు తగ్గట్లుగా.. ఇమేజ్ కు తగ్గట్లుగా అభిమానుల అంచనాలకు తగ్గట్లుగా తాను స్క్రిప్ట్ ను రెడీ చేస్తున్నట్లుగా చెప్పుకొచ్చాడు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ మొదలు అయ్యిందని అనిల్ రావిపూడి చెప్పుకొచ్చాడు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో బాలయ్య అభిమానులకు ఒక స్పష్టత ఇచ్చాడు.

ఎఫ్ 3 సినిమా ప్రమోషన్ లో భాగంగా వరుసగా మీడియాలో సందడి చేస్తున్న అనిల్ రావిపూడి తదుపరి సినిమా బాలయ్య 108 పై కూడా స్పందించాడు. బాలయ్య డైలాగ్స్ అంటే తనకు ఇష్టం అని.. ఆ తరహా డైలాగ్స్ ను తన సినిమాలో పెట్టడంతో పాటు.. ఆయన మార్క్ మాస్ సన్నివేశాలు… నా మార్క్ ఫన్ సన్నివేశాలు ఉంటాయని క్లారిటీ ఇచ్చాడు.

పెద్ద హీరో మహేష్ బాబునే సరిలేరు నీకెవ్వరు సినిమా సందర్బంలో సరిగ్గా హ్యాండిల్ చేసి సక్సెస్ దక్కించుకున్న అనీల్ రావిపూడి ఖచ్చితంగా బాలయ్య ను కూడా అభిమానులు ఎలా అయితే కోరుకుంటున్నారో అలాగే డీల్ చేస్తాడని అభిమానులు కూడా ఒకింత ఆశాభావంతో ఉన్నారు. ప్రస్తుతం బాలయ్య చేస్తున్న సినిమా కంటే కూడా ఆ తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేయబోతున్న సినిమా పట్ల బాలయ్య అభిమానులు ఆసక్తిగా ఉన్నారు. కనుక అనీల్ రావిపూడి మరింత జాగ్రత్తగా ఉండటం ఖాయం.