వావ్.. ఆ హీరోయిన్ డబుల్ హ్యాట్రిక్

సక్సెస్ రేట్ తక్కువుండే సినీ పరిశ్రమలో వరుసగా రెండు మూడు హిట్లు కొట్టడమే కష్టం. అలాంటిది ఒక హీరోయిన్ వరుసగా ఆరు హిట్లు కొట్టేసింది. ఇప్పటిదాకా ఫ్లాప్ అన్నదే లేకుండా దూసుకెళ్తోంది.  ఆ హీరోయిన్ మరెవరో కాదు.. మలయాళ కుట్టి అనుపమ పరమేశ్వరన్. ఆమె డబుల్ హ్యాట్రిక్‌లో మూడు సినిమాలు తెలుగువే కావడం విశేషం.  రెండేళ్ల కిందట మలయాళ బ్లాక్ బస్టర్ ‘ప్రేమమ్’తో కథానాయికగా పరిచయమైంది అనుపమ. రింగు జుట్టుతో రెగ్యులర్ హీరోయిన్లకు చాలా భిన్నంగా కనిపించిన అనుపమను మలయాళ ప్రేక్షకులు నెత్తిన పెట్టుకున్నారు. పాత్ర చిన్నదే అయినా.. ఆమెకు భలే పేరొచ్చింది. వెంటనే ఆమెపై టాలీవుడ్ కళ్లు పడ్డాయి.

త్రివిక్రమ్ ‘అఆ’లో అవకాశమిచ్చాడు. ఆ సినిమా సూపర్ హిట్. తర్వాత ‘ప్రేమమ్’ రీమేక్‌లో ఒరిజినల్లో చేసిన పాత్రే చేసింది. అదీ హిట్టే. లేటెస్టుగా ‘శతమానం భవతి’తో మంచి విజయాన్ని ఖాతాలో వేసుకుని తెలుగులో హ్యాట్రిక్ కొట్టేసింది అనుపమ. మరోవైపు అనుపమ తమిళంలోనూ గత ఏడాదే అరంగేట్రం చేసింది. ఆమె నటించిన ‘కొడి’ సూపర్ హిట్టయింది. ఇక మలయాళంలో ‘ప్రేమమ్’ తర్వాత చాలా గ్యాప్ తీసుకుని ఆమె చేసిన సినిమా కూడా హిట్ టాక్ తెచ్చుకుంది. స్టార్ హీరో దుల్కర్ సల్మాన్‌కు జోడీగా ‘జామాంట్ సువిశేషంగల్’ అనే సినిమాలో నటించింది. ‘శతమానం భవతి’ వచ్చిన ఐదు రోజులకు కేరళలో విడుదలైన ఈ సినిమా హిట్ టాక్‌తో రన్ అవుతోంది. ఈ సినిమాతో ఆమె హిట్ల డబుల్ హ్యాట్రిక్ పూర్తి చేసింది. ఇలాంటి లక్కీ హీరోయిన్‌కు తెలుగులో రెండు పెద్ద అవకాశాలు వచ్చినట్లే వచ్చి చేజారాయి. అయినప్పటికీ ఆమె ట్రాక్ రికార్డు చూసి అవకాశాలివ్వకుండా పోరులెండి.


Recent Random Post: