మళ్ళీ బరువు తగ్గుతానంటోన్న అనుష్క

హీరోయిన్ గా అనుష్క శెట్టి రేంజ్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించుకోవాల్సిన అవసరం లేదు. అనుష్క టాప్ నటిగా ఎప్పుడో ఫేమ్ ను సంపాదించుకుంది. కేవలం తన పేరు మీదనే సినిమాకు మార్కెట్ అయ్యే స్థాయికి చేరుకుంది ఈ భామ. హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలకు కేరాఫ్ అడ్రెస్ గా మారిన అనుష్క ఎప్పటినుండో గ్లామర్ రోల్స్ కు దూరంగా ఉండిపోయింది.

గతేడాది అనుష్క నటించిన నిశ్శబ్దం విడుదలైంది. ఆ సినిమా అనుకున్నంత సక్సెస్ కాలేకపోయింది. నిశ్శబ్దం తర్వాత అనుష్క మరో సినిమాను ప్రకటించింది లేదు. అయితే యూవీ క్రియేషన్స్ బ్యానర్ లోనే అనుష్క తన నెక్స్ట్ సినిమాను చేయనుంది. ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కానీ నవీన్ పోలిశెట్టి ఈ చిత్రంలో హీరోగా నటించనున్నాడు.

ఒక విభిన్నమైన కథాంశంతో తెరకెక్కనున్న ఈ చిత్రం కోసం అనుష్క బరువు తగ్గాల్సి ఉంది. ప్రస్తుతం షూటింగ్స్ జరిగే పరిస్థితి లేకపోవడంతో అనుష్క ఈ సమయాన్ని తన బరువు తగ్గడానికి ఉపయోగించుకుంటోంది.