
అగ్ర కథానాయకుడి సినిమా అంటే అంచనాలన్నీ భారీగా ఉంటాయి. ఇందుకు తగ్గట్లే క్లైమాక్స్ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. అయితే.. త్రివిక్రమ్.. పవన్ కలిసి చేసిన అత్తారింటికి దారేది.. మూవీ క్లైమాక్స్ చాలా భిన్నంగా ఉంటుంది. రెగ్యులర్ మూవీలలో క్లైమాక్స్ వచ్చే సరికి భారీ యాక్షన్ సీన్లు తప్పనిసరి. కానీ.. అందుకు భిన్నంగా అత్తారింటికి దారేది మూవీలో క్లైమాక్స్‌ను విభిన్నంగా చిత్రీకరించి అందరి మనసుల్ని దోచేశారు త్రివిక్రమ్.
తాజాగా పవన్ తో జత కట్టి ముచ్చటగా మూడోసారి చేస్తున్న ఈ మూవీకి సంబంధించిన క్లైమాక్స్ సీన్లను షూట్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. రామోజీ ఫిలింసిటీలో జరుగుతున్న క్లైమాక్స్‌ను షూట్ అనంతరం బ్యాలెన్స్ వర్క్ కాస్త మిగిలి ఉంటుందని.. దాన్ని యూరప్ లో పూర్తి చేయనున్నట్లుగా తెలుస్తోంది.
ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రస్టింగ్ న్యూస్ ఏమిటంటే.. అత్తారింటికి దారేది మూవీలో ఏ విధంగా అయితే క్లైమాక్స్ హైలెట్ అయ్యిందో.. ఈ సినిమాలోనూ క్లైమాక్స్‌ను అలానే ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది. ఫైటింగ్ తో పాటు మనసుకు హత్తుకునే సంభాషణలతో పతాక సన్నివేశాలు ఉండనున్నట్లుగా చెబుతున్నారు.
చూస్తుంటే.. అత్తారింటికి దారేది తరహాలోనే క్లైమాక్స్‌ను ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది. నిజం ఏమిటన్నది సినిమా చూస్తే కానీ తెలీదట.
Recent Random Post: