
‘బాహుబలి: ది బిగినింగ్’ విడుదలకు మూడు నెలల ముందే ట్రైలర్ విడుదలైంది. కానీ ‘బాహుబలి: ది కంక్లూజన్’ రిలీజ్‌కు ఇంకో రెండు నెలలే సమయం ఉన్నప్పటికీ ప్రేక్షకులు ట్రైలర్ రుచి చూడలేదు. మధ్యలో టీజర్ గురించి ఊహాగానాలు వినిపించాయి కానీ.. అలాంటిదేమీ లేదని తేలిపోయింది. నేరుగా ట్రైలర్ లాంచ్ చేయడానికే నిర్ణయించుకున్నట్లు సమాచారం. మరి ఈ ట్రైలర్ ఎప్పుడొస్తుంది అన్నది ఇప్పుడు ‘బాహుబలి’ అభిమానుల్లో ఉత్కంఠ రేపుతున్న ప్రశ్న. ఈ ప్రశ్నకు రాజమౌళి సమాధానం ఇచ్చాడు. మార్చి మధ్యలో ట్రైలర్ లాంచ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పాడు జక్కన్న. ఐతే డేట్ మాత్రం ఇప్పుడు చెప్పే పరిస్థితి లేదన్నాడు.
‘బాహుబలి’ ట్రైలర్‌ను రాజమౌళి బృందం ఆల్రెడీ కట్ చేసేసిందట. ట్రైలర్లో చూపించాల్సిన షాట్లన్నీ రెడీగా ఉన్నాయట. ఎడిటింగ్ అయిపోయిందట. ఐతే ఆ షాట్లకు వీఎఫ్ఎక్స్, కంప్యూటర్ గ్రాఫిక్స్ జోడించాల్సి ఉందని.. ఆ కంటెంట్ కోసమే వెయిటింగ్ అని రాజమౌళి తెలిపాడు. ముందే ట్రైలర్ లాంచ్ డేట్ ఇచ్చేస్తే.. సరిగ్గా ఆ సమయానికే వీఎఫ్ఎక్స్ స్టూడియో వాళ్లు కంటెంట్ ఇస్తారని.. అప్పుడు ట్రైలర్‌కు అవి మిక్స్ చేసి.. పర్ఫెక్ట్ షేప్ తీసుకురావడంలో ఏదైనా ఆలస్యమైతే చెప్పిన సమయానికి ట్రైలర్ రాలేదని జనాలు గోల పెట్టేస్తారని.. అందుకే వీఎఫ్ఎక్స్ స్టూడియో వాళ్లు ఇచ్చే కంటెంట్ కోసం వెయిటింగ్ అని రాజమౌళి తెలిపాడు. డేట్ చెప్పలేకపోయినప్పటికీ మార్చి మధ్యలో ట్రైలర్ వస్తుందని మాత్రం చెప్పగలనని రాజమౌళి చెప్పాడు.
Recent Random Post:

















