అమెరికాలో అప్పుడే 3 మిలియన్ డాలర్లా?

ఇంకా ప్రిమియర్స్ పడనే లేదు. షో మొదలే కాలేదు. అప్పుడే బాహుబలి అమెరికా వసూళ్లు 3 మిలియన్ డాలర్లను దాటిపోవడం విశేషం. ఇది తెలుగు సినిమా వరకే కాదు.. మొత్తంగా ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ చరిత్రలోనే కనీ వినీ ఎరుగని రికార్డు. స్వయంగా ఈ చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్న గ్రేట్ ఇండియన్ ఫిలిమ్స్ సంస్థే ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది.

కొన్ని గంటల కిందట ఆ సంస్థ విడుదల చేసిన ప్రకటన ప్రకారం బాహుబలి అన్ని వెర్షన్లకు కలిపి ఇప్పటిదాకా జరిగిన ప్రి రిలీజ్ బుకింగ్స్ ప్రకారం వసూళ్లు 3 మిలియన్ డాలర్లను దాటిపోయాయి. ప్రతి గంటకూ లక్ష డాలర్ల దాకా వసూళ్లు జమ అవుతున్నట్లుగా ఆ సంస్థ పేర్కొంది.

ఈ లెక్కన చూస్తుంటే ప్రిమియర్లతోనే బాహుబలి-2 నాలుగు, ఐదు మిలియన్ డాలర్ల మధ్య వసూలు చేసేలా కనిపిస్తోంది. వీకెండ్ అయ్యేసరికే 10 మిలియన్ మార్కును అందుకున్నా ఆశ్చర్యం లేదేమో. అమెరికా, కెనడాల్లో కలిపి బాహుబలి-2 దాదాపు 1100 స్క్రీన్లలో రిలీజవుతుండటం విశేషం. ఈ చిత్రానికి ఉన్న డిమాండ్ దృష్ట్యా ప్రిమియర్స్ టికెట్ ధర దాదాపు 40 డాలర్లు పలుకుతుండటం విశేషం.

ఐతే ఈ చిత్రంపై పెట్టిన భారీ పెట్టుబడి దృష్ట్యా కనీసం 15 మిలియన్ డాలర్లు వసూలు చేస్తే తప్ప బయ్యర్ సేఫ్ జోన్లోకి రావడం కష్టం. ఐతే ప్రస్తుతం కనిపిస్తున్న హైప్ చూస్తుంటే ఆ వసూళ్లను అందుకోవడం అంత కష్టమేమీ కాదని అర్థమవుతోంది.


Recent Random Post: