
ఈమధ్య ఆకర్షణీయమైన ట్రెయిలర్ కట్ చేయడం, తీరా సినిమాలో ఆ ట్రెయిలర్‌లో చూపించిన మేటర్ తప్ప మరేమీ లేకపోవడం కామన్ అయిపోయింది. ‘బాబు బాగా బిజీ’ చిత్రం ట్రెయిలర్ చూసి అడల్ట్ కామెడీలో సరికొత్త అధ్యాయం కాబోతోందని, తెలుగు సినిమా బాగా బోల్డ్ అయిపోయిందని అనుకున్నారు.
లక్షల కొద్దీ వ్యూస్ వచ్చిన ఆ ట్రెయిలర్‌తో ‘బాబు బాగా బిజీ’కి బిజినెస్ కూడా బ్రహ్మాండంగా జరిగిపోయింది. తీరా సినిమాలో ట్రెయిలర్‌లో చూపించినది తప్ప ఇంకేమీ లేకుండా పోయింది. తాజాగా ‘వెంకటాపురం’ పరిస్థితి కూడా అలాగే తయారైంది. ట్రెయిలర్ చాలా ఆకర్షణీయంగా కట్ చేసిన దర్శకుడు చిత్రాన్ని మొత్తం అదే స్థాయిలో తీర్చిదిద్దడంలో విఫలమయ్యాడు.
కేవలం ట్రెయిలర్‌లో చూపించిన పాయింట్ తప్ప ఈ చిత్రంలో ఎక్సయిటింగ్ ఎలిమెంట్ అంటూ ఇంకేమీ లేదు. ట్రెయిలర్ చూసి ఏదో వుంటుందని ఆశించి వచ్చిన వాళ్లు తీవ్రంగా నిరాశ పడుతున్నారు. ట్రెయిలర్‌కి కావాల్సిన కంటెంట్ రెడీ చేసుకుంటోన్న దర్శకులు రెండు గంటల సినిమాకి తగ్గ మెటీరియల్ సిద్ధం చేసుకుంటే రిజల్ట్స్ బాగుంటాయి. ఆసక్తికరమైన ట్రెయిలర్ కట్ చేసి సినిమాలో ఏమీ లేకపోతే అది అంతకరటే చాలా డేంజర్. ట్రెయిలర్‌తో జనాన్ని మోసం చేసిన ఫీలింగ్ వల్ల పూర్తిగా తిప్పికొట్టేస్తారు… బాబు బాగా బిజీకి జరిగినట్టు.
Recent Random Post: