బాలయ్య సినిమాలో మాస్ ఖిలాడీ ఐటెం సాంగ్‌

అఖండ సినిమాతో సక్సెస్‌ జోష్ లో ఉన్న నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో ఒక సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. ఇప్పటికే సినిమా నుండి ఫస్ట్‌ లుక్‌ ను రివీల్ చేయడం జరిగింది. చాలా పవర్‌ ఫుల్‌ పాత్రలో బాలయ్య కనిపించబోతున్నట్లుగా ఆ గెటప్ చూస్తుంటేనే అర్థం అవుతోంది. బాలకృష్ణ ప్రస్తుతం చేస్తున్న సినిమాల విషయంలో ఖచ్చితంగా అభిమానులు చాలా ఆసక్తిగా ఉన్నారు. వారి అంచనాలను అందుకునే విధంగా దర్శకుడు గోపీచంద్‌ మలినేని ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.

షూటింగ్ ముగింపు దశకు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్ గా శృతి హాసన్ నటిస్తున్న విషయం తెల్సిందే. ఇక ఈ సినిమాలో మాస్ ఐటెం సాంగ్‌ ను ఖిలాడీ హీరోయిన్ డింపుల్‌ హయతీ చేయబోతుంది. గతంలోనే ఈ అమ్మడు పలు ఐటెం సాంగ్స్ తో రెచ్చి పోయింది. ఖిలాడీ సినిమా లో హీరోయిన్ గా చేసింది. మళ్లీ బాలయ్య కోసం ఐటెం సాంగ్‌ చేస్తోంది. థమన్ స్వర పర్చిన మాస్ ఐటెం సాంగ్‌ లో బాలయ్య మరియు డింపుల్‌ హయతితో శేఖర్ మాస్టర్ స్టెప్పులు వేయిస్తున్నాడు. త్వరలో సినిమా విడుదల తేదీపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.