స్టార్ రైటర్ చేతికి బాలయ్య ఐకానిక్ మూవీ సీక్వెల్

నందమూరి బాలకృష్ణ హీరోగా తన కొడుకు మోక్షజ్ఞ వెండితెరకు పరిచయమయ్యేలా ఆదిత్య 369 చిత్ర సీక్వెల్ ను ప్లాన్ చేసిన విషయం తెల్సిందే. ఆదిత్య 999 అనే టైటిల్ గా ఈ చిత్ర స్క్రిప్ట్ వర్క్ పై సీనియర్ దర్శకులు సింగీతం శ్రీనివాస రావు వర్క్ చేసారు. కొన్ని సంవత్సరాల క్రితం ఈ ప్రాజెక్ట్ సెట్ అయినట్లే అనిపించింది కానీ బాలయ్య అప్పుడే గౌతమీపుత్ర శాతకర్ణి, ఎన్టీఆర్ బయోపిక్ సినిమాలతో బిజీ అవ్వడం వల్ల ఆదిత్య 999 కుదర్లేదు.

అయితే మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత ఈ ప్రాజెక్ట్ మళ్ళీ పట్టాలెక్కేలా కనిపిస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఆదిత్య 999 స్క్రిప్ట్ రీ వర్క్ స్టార్ రైటర్ సాయి మాధవ్ బుర్రాకు అప్పగించినట్లు తెలుస్తోంది. ఈ స్క్రిప్ట్ ను డాక్టరేట్ చేసాక మళ్ళీ బాలయ్యకు నరేషన్ ఇస్తారట. అది కనుక ఓకే అయితే ఆదిత్య 999 పట్టాలెక్కడం ఖాయంగా కనిపిస్తోంది.

ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను సినిమా చేస్తున్న విషయం తెల్సిందే. ఈ సినిమా పూర్తయ్యాక ఇంకా ఏ చిత్రం అధికారికంగా అంగీకరించకపోయినా బి గోపాల్ చిత్రం లేదా ఆదిత్య 999లో ఒక దాన్ని సెట్స్ పైకి తీసుకెళ్లాలని బాలయ్య భావిస్తున్నాడు. చూద్దాం మరి ఏం జరుగుతుందో.


Recent Random Post: