అభిమానికి కాల్‌ చేసిన బాలయ్య

నందమూరి బాలకృష్ణ మరోసారి తన మంచితనంను చాటుకున్నాడు. తన అభిమానులకు ఎప్పటికి చేరువగా ఉండే బాలయ్య రెగ్యులర్‌ గా అభిమానులతో టచ్ లో ఉంటాడు. ఇటీవల తన బర్త్‌ డే సందర్బంగా అభిమానులతో జూమ్‌ కాల్‌ కూడా మాట్లాడిన బాలకృష్ణ మరోసారి అభిమానులను సర్‌ ప్రైజ్ చేశాడు. చిత్తూరు జిల్లాకు చెందిన మురుగేష్‌ బాలయ్య అభిమాని చెట్టు మీద నుండి కింద పడ్డాడు. దాంతో నడుము విరిగింది. అతడి గురించి తెలుసుకున్న బాలకృష్ణ స్వయంగా కాల్‌ చేసి మరీ వాకబు చేశాడు.

అధైర్యపడకుండా మందులు వాడుతూ ఫిజియోథెరఫీ చేయించుకోవాలని సూచించాడు. ధైర్యంగా ఉంటే తప్పకుండా స్పీడ్‌ రికవరీ అవుతావు అంటూ కూడా ధైర్యం చెప్పాడు. తిరిగి కోలుకున్న తర్వాత తప్పకుండా కలుద్దాం అంటూ అభిమానికి బాలయ్య మనో ధైర్యం ఇచ్చాడు. అవసరాల కోసం రూ.40 వేలు ఇచ్చాడు. మొత్తానికి బాలయ్య తో మాట్లాడటంతో ఆ అభిమాని ఆనందానికి అవధులు లేకుండా పోయింది.