బాలయ్య సినిమా టైటిల్ రూమర్స్ ను నమ్మొద్దు – నిర్మాతలు

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం చేస్తోన్న యాక్షన్ ఎంటర్టైనర్ అఖండ తర్వాత హిట్ చిత్రాల దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా చేయనున్న విషయం తెల్సిందే. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. నిజ జీవిత సంఘటనల నుండి ఇన్స్పైర్ అయ్యి గోపీచంద్ మలినేని ఈ కథను రాసుకున్నట్లు తెలుస్తోంది.

మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. మరో రెండు నెలల్లో రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని సమాచారం. ఇక గత కొన్ని రోజుల నుండి ఈ చిత్ర టైటిల్ విషయంలో రూమర్స్ షికార్లు చేస్తున్నాయి. ఈ చిత్రానికి టైటిల్ కన్ఫర్మ్ అయింది అంటున్నారు.

కానీ నిర్మాతలు ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. “మా సినిమాపై మీ అందరి ఆసక్తికి ఆనందిస్తున్నాం. కానీ బాలయ్య 107వ సినిమాకు ఇంకా టైటిల్ కన్ఫర్మ్ అవ్వలేదు. సరైన సమయం వచ్చినప్పుడు మేమె టైటిల్ ను అధికారికంగా వెల్లడిస్తాం” అని ప్రకటన విడుదల చేసారు.