షారుఖ్ సినిమాకు బాలయ్య సినిమా టైటిల్..!

తమిళ స్టార్ డైరక్టర్ అట్లీ దర్శకత్వంలో బాలీవుడ్ బాద్ షా ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా మొదలైంది కూడా. నయనతార, ప్రియమణి హీరోయిన్లుగా నటిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. బిగ్ బజ్ క్రియేట్ అయిన ఈ సినిమాపై ఇప్పుడో వార్త బాలీవుడ్ లో షేక్ అవుతోంది. ఈ సినిమా టైటిల్ గా ‘లయన్’ ఖరారు చేసినట్టు తెలుస్తోంది.

ఈ సినిమా షూటింగ్ నిమిత్తం సంత్ తుకారామ్ మెట్రో రైల్వే స్టేషన్ లో షూటింగ్ కు అనుమతి కోరుతూ ఓ లేఖ రాసింది. ఇందులో సినిమా టైటిల్ గా ‘లయన్’గా పేర్కొనడంతో ఈ వార్త వైరల్ అయింది. ఇదే టైటిల్ తో తెలుగులో బాలకృష్ణ ఓ సినిమా చేయడం విశేషం. దీంతో బాలయ్య ఫ్యాన్స్ తమ హీరో టైటిల్ అంటూ ఖుషీ అవుతున్నారు. కొన్నేళ్లుగా సరైన సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్న షారుఖ్ కు ఈ సినిమా కీలకం కాబోతోంది.